మడిపల్లి రాజ్‍కుమార్ ll కాగితప్పడవలు ll గులాబీ పూరిక్కలు సుతిమెత్తగా పరిచిన కాగితప్పడవలు వాటిలో చిన్నారి మురిపాన్ని ముద్దుగా మూటగట్టి పంపుతున్నట్లు జోరుగా వానకురిసిన రోజుల్లో వీధుల్లో నీటి కాలువల వెంట పోటీపడి ప్రవహించిన బాల్యచాపల్యం మళ్ళీ పురివిప్పుకున్నట్లు ఇప్పుడూ అంతే ఉత్సాహంతో ఊహా కౌశలంతో భావాల్ని పరిచిన వాక్యవిన్యాసపు కవితలనూ "కవిసంగమ" ప్రవాహంలో వదులుతూ.. కాకపోతే ఇప్పుడు కవితలు ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోతుంటే పిసరంత దిగులు * * * కాస్తా కామెంట్లతో లంగరు వేయరూ ప్లీజ్! 13/5/2014
by Raj Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qyd7Io
Posted by Katta
by Raj Kumar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qyd7Io
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి