నిట్టూర్పు నీ అభిప్రాయాలు మార్చుకు తిరిగావా లోకం తన ఆడంబరాలకు కాలం తన కవ్వింపులకు నిన్ను ఆహ్వానించకపోగా తన సౌఖ్యాల నుండి నిన్ను అంటరానివాడిగా వెలివేస్తుంది నువ్వు గీసుకున్న లక్ష్మణరేఖ నువ్వు దాటలేక వృత్తంలో పంజరమై చావలేక నటిస్తూ భరిస్తూ వీలుంటే పరిహసిస్తూ నవ్వుతూ మానవత్వాన్ని ప్రదర్శిస్తావు గర్జంచే మేఘాలంటే నీకు అసహ్యం చీకట్లో గుసగుసలంటే పరమ చిరాకు ఎంతో సుకుమారంగా పెంచుకున్న తోట నుండి కిరాతకంగా పువ్వుల్ని కోసేస్తావు రక్తమంటే నీ దేహంలో ప్రవహించే ప్రాణమంటే నమ్మవు భేదాలన్నీ నువ్వు పెట్టుకుని సమాజాన్ని నిందిస్తావు సంకెళ్లు ఖైధీలకు వేస్తారని భ్రమించావు సిరి సంపదలు జన్మ హక్కులనే వెలకట్టావ్ సాయం సంధ్యకు సాగరానికి నడిచి వెళ్లే దారి ఒకటే నీది అలలపై వీరంగం చేసే చూపులే నీవి యిసుకలో గూడు కట్టి కెరటాలకు అది కూలిపోతుంటే నువ్వు విడిచే నిట్టూర్పే హాయి కల్మషం లేని ఒక హృదయం అలలపై లోకాన్ని మరచి ఆడుకుంటోంది చూడు అది నీదే ఉదయ్ 13.05.14
by Uday Dalith
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lrMfo9
Posted by Katta
by Uday Dalith
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lrMfo9
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి