పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Bandla Madhava Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bandla Madhava Rao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జూన్ 2014, బుధవారం

Bandla Madhava Rao కవిత

మీడియా చేస్తున్న దుర్మార్గాల్ని తప్పకుండా ఖండించాల్సిందే. అందులో ఉపయోగించే భాష, ప్రతిబింబంచే సంస్కృతి వీటన్నింటి గురించి నా మటుకు నాకు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. నిజానికి తెలుగు వాళ్లు చేసే భాషా పరిరక్షణ ఉద్యమాలన్నీ కేవలం టివి చానళ్ల కార్యాలయాలముందు చేయాలనేది నా వాదన. పానుగంటి వారి సాక్షి వ్యాసాలలోని వ్యంగ్యం తన రూపాన్ని పోగొట్టుకొని కించపరచడమో అవమానించడమో వ్యంగ్యమై పోయింది ఇవాళ. ఇందుకు ప్రసార మాధ్యమాల వారు ఎవరూ మినహాయింపు కాదు.పత్రికా స్వేచ్చ దుర్వినియోగమవుతుందనడం లో ఎటువంటి సందేహం లేదు. అయితే అదే సమయం లో ప్రభుత్వాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిమీద చట్టపరమైన లేదా న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించాలి గాని నిషేధం ఎంతమాత్రం సబబు కాదు. మీడియా మీద నేను రాసిన కవిత ఆంధ్రజ్యోతి లో ప్రచురితమైనది ఇక్కడ మళ్లి పోష్ట్ చేస్తున్నాను. నా దేశపు నాలుగో స్తంభం గుండె చేతబట్టుకొని అత్యంత ఉత్కంఠతో ప్రాణాలుగ్గబట్టుకొని ఒకానొక అంతర్యుద్ధాన్ని కళ్లారా వీక్షిస్తున్నాను * * * * వ్యాఖ్యలొద్దు ఊహాగానాలూ వద్దు మాటల్ని నిలువునా చీల్చి చెప్పే వాటి వెనుక మర్మాల్ని ఎవరూ బట్ట బయలు చెయ్యనవసరం లేదు వక్రోక్తులూ వ్యంగ్యోక్తులూ అలంకారాలేమో కాని నీకు నా జీవితమే వ్యంగ్యమైపోయింది సమాజం మెరుగవ్వడం కోసం నువ్వు కూల్చే వాస్తవాల గోడల మధ్య నిప్పులాంటి నిజాల్ని కాల్చి బూడిద మిగులుస్తున్నావు ప్రతి క్షణం దమ్ము తోనో ధైర్యం తోనో అందించే సమాచారం లో నిజం పాలెంత చీకటంటే నల్లగా మాత్రమే ఉంటుందని తెలుసు చీకటికి రంగులు పులుముతున్న దృశ్యాన్ని చూస్తున్నాను సరిహద్దుల కటూ యిటు నిరంతర సంఘర్షణ తెరమీది నాటకానికి వెనుక వ్యూహ ప్రతివ్యూహాలు ఇంట్లో రంగుల డబ్బాలో జరిగే మాటల యుద్ధాన్ని మోస్తున్నవాడ్ని ఎప్పటికీ హంసను కాలేను * * * * నా దేశపు నాలుగో స్తంభానికిప్పుడు చీడ పట్టింది మాటలే మాటల్ని హత్య చేస్తున్న వేళ మాట సూటిదనాన్ని కోల్పోయింది ముఖానికేసుకొన్న రంగుల్లో మాటలు దాక్కుంటున్నాయి అసలు మాట అక్కడ ఉండగానే మాటల నీడలు ఎల్లలు దాటుతున్నాయి తెర మీద చేసుకొనే ఉత్తుత్తి యుద్ధాలకు బలవుతున్న వాడ్ని నిర్మించబడుతున్న నిజాల మధ్య ప్రాణ విలువ వార్త కంటే తక్కువై పోయింది నీ రేటింగ్ సూచికి వేళాడుతూ నేను పోగొట్టుకొన్న ప్రాణం నీకొక రోజు పతాక శీర్షిక రేపటికది పకోడి పొట్లం నాకిప్పుడు నిజం కావాలి సూటిగా చెప్పే మాట కావాలి మాట వలన లోకం వర్ధిల్లాలి * * * *

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lSznJb

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Bandla Madhava Rao కవిత

విడివిడిగానే గూళ్లను వదిలి గుట్టల్ని వదిలి కొమ్మల మధ్య చిక్కుకున్న రెక్కల్ని పొదవుకుంటూ ఒక మహావృక్షం మీదనుంచీ వాలడానికి అనువైన మరో చెట్టు కోసం అన్వేషిస్తూ దశాబ్దాల ముందర మొదలైన ప్రయాణం ఉరకలెత్తే నీళ్ల మధ్య పుట్టినందుకు ప్రశ్నించడాన్ని ఎదిరించడాన్ని ముందే నేర్చుకొన్నందుకు ఎగరడమే నేరమైపోయిందివాళ నీళ్ల కొసం వలస పిడికెడు మెతుకుల కోసం వలస జాతి తరతరాల చరిత్రంతా పోరాటాలూ అన్వేషణలూ ఎక్కడెక్కడో ఎగరడాలూ వాలడాలూ ఎవరికీ ఏదీ సొంతం కానప్పుడు అంతా అందరిదీ అయినప్పుడు ఒకళ్లనొకళ్లం ఆలింగనం చేసుకొన్నాం రెక్కల కష్టాల్నీ కన్నీళ్లనీ పంచుకొన్నాం కొత్తగా ఇప్పుడే ఒకరొకొకరం తలక్రిందులుగా కనబడుతున్నాం సరిహద్దు రేఖల్ని గురించి సంవాదాలు మొదలువుతున్నాయి ఎదురైనవాళ్లను ప్రశ్నించిన మనం కలిసి నడిచొచ్చిన కాళ్లనే విరగ్గొడుతున్నాం చేతుల్లోని పువ్వుల్ని గుర్తించకుండా మందుపాతరల్ని అన్వేషిస్తున్నాం ఎప్పుడూ నేనే నీకు లక్ష్యమవ్వడమే నాకు మిగిలిన విషాదం చెరిపేసుకున్నా నిర్మించుకున్నా అటూ ఇటూ మనమే మెట్లు మెట్లుగా విడివడ్డ మనమీదనుంచీ నడిచెళ్లినవాడు సుఖంగా లక్ష్యాన్ని చేరుకొంటాడు లక్ష్యానికి అనంత దూరంలో నువ్వూ నేనూ ***

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SkiQ4P

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Bandla Madhava Rao కవిత

పక్షి ఎగిరిపోయింది నువ్వేఎగురుకుంటూవచ్చి నాముందు వాలావో నేనే నీముందు వాలానో ఈ చెట్టుకింద చేరి చాలా కాలం విత్తనాల్ని పొడుచుకొని పొడుచుకొని తిన్నాం ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని నేర్చుకున్నాం పేర్చుకున్నాం స్నేహించుకున్నాం నువ్వలా ఎగిరిపోవడానికి కారణం తెలిసినా గమ్యం చేరకుండానే నిష్క్రమించడాన్ని గురించే దిగులంతా కలపాల్సిన రంగుల్ని డబ్బాల్లోనే వదిలేసి కాన్వాసును ఖాళీగా మిగల్చడాన్ని గురించే ప్రశ్నంతా ఇవాళ నువ్వేసిన అడుగుకు రేపు మరికొన్ని అడుగులు జతపడే సమయాన పాదముద్రలు లేకపోవడమే విచారమంతా మహావృక్షమంత విస్తరించాల్సిన నువ్వు ముడుచుకుపోయిన వైనాన్ని తెల్ల కాగితం మధ్యలో ఆగిపోయిన అక్షరాల్ని తెరచి ఉంచిన కలాన్ని కళ్లనుండి తీసిన అద్దాల్ని నీ అదృశ్యానంతర దృశ్యాల్ని చిప్పిల్లిన కళ్లతో వీక్షిస్తున్నాను బహుశ నువ్వు లేనప్పుడు నీ దేహం మీద పరుచుకున్న వస్త్రాన్ని గద్గద స్వరంతో నీ ఉనికి గురించి అవి ప్రశ్నించే ఉంటాయి నీ దిగులు కళ్ల ప్రశ్నా ముఖం ఎదురుగా నిలబడి రేపటి గురించి నన్ను నిలదీస్తూనే ఉంది పొదవుకునే చేతుల్ని చాచడం మినహా నేనేం చేయగలను.

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iVHZtJ

Posted by Katta

Bandla Madhava Rao కవిత

పక్షి ఎగిరిపోయింది నువ్వేఎగురుకుంటూవచ్చి నాముందు వాలావో నేనే నీముందు వాలానో ఈ చెట్టుకింద చేరి చాలా కాలం విత్తనాల్ని పొడుచుకొని పొడుచుకొని తిన్నాం ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని నేర్చుకున్నాం పేర్చుకున్నాం స్నేహించుకున్నాం నువ్వలా ఎగిరిపోవడానికి కారణం తెలిసినా గమ్యం చేరకుండానే నిష్క్రమించడాన్ని గురించే దిగులంతా కలపాల్సిన రంగుల్ని డబ్బాల్లోనే వదిలేసి కాన్వాసును ఖాళీగా మిగల్చడాన్ని గురించే ప్రశ్నంతా ఇవాళ నువ్వేసిన అడుగుకు రేపు మరికొన్ని అడుగులు జతపడే సమయాన పాదముద్రలు లేకపోవడమే విచారమంతా మహావృక్షమంత విస్తరించాల్సిన నువ్వు ముడుచుకుపోయిన వైనాన్ని తెల్ల కాగితం మధ్యలో ఆగిపోయిన అక్షరాల్ని తెరచి ఉంచిన కలాన్ని కళ్లనుండి తీసిన అద్దాల్ని నీ అదృశ్యానంతర దృశ్యాల్ని చిప్పిల్లిన కళ్లతో వీక్షిస్తున్నాను బహుశ నువ్వు లేనప్పుడు నీ దేహం మీద పరుచుకున్న వస్త్రాన్ని గద్గద స్వరంతో నీ ఉనికి గురించి అవి ప్రశ్నించే ఉంటాయి నీ దిగిలు కళ్ల ప్రశ్నా ముఖం ఎదురుగా నిలబడి రేపటి గురించి నన్ను నిలదీస్తూనే ఉంది పొదవుకునే చేతుల్ని చాచడం మినహా నేనేం చేయగలను.

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kKsV1G

Posted by Katta

30, ఏప్రిల్ 2014, బుధవారం

Bandla Madhava Rao కవిత

కవి మిత్రులారా! మే 1వ తేదీన గత 15 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా నిరాటంకంగా సాగుతున్న "కవిత్వంతో ఒక సాయంత్రం" కవిత్వపు పండుగ కార్యక్రమం లో అందరం కలుద్దాం రండి. .(ఒకానొక సందర్భంలో ఒక కవి తనకు ఈ కవి సమ్మేళనంలో చోటు కల్పించలేదని ఆ ప్రాంగణంలోనే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించాడు కూడా. అయినా కార్యక్రమానికి ఏటువంటి ఆటంకం కలుగలేదు.) 10 సంవత్సరాలుగా అప్రతిహతంగా వెలువడుతున్న "కవిత" సాంవత్సరిక సంచిక ఆవిష్కరణ కూడా రేపే. ప్రముఖ కవి శివారెడ్డి చేతులమీదగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరూ రండి. సాహితీ మిత్రులు, విజయవాడ.

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PCRFRr

Posted by Katta

16, మార్చి 2014, ఆదివారం

11, మార్చి 2014, మంగళవారం

Bandla Madhava Rao కవిత

కవి మిత్రులారా మీ మీ కవితలు ఏ పత్రికలో ప్రచురితమైనా వాటి వివరాలు లేదా ఆయా కవితలు కవిత 2014 ప్రచురణల డైరీ పేజీలో అతికించడి.

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i9qngm

Posted by Katta