పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Ajay Pandu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ajay Pandu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జూన్ 2014, గురువారం

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు -10!! !! పిచ్చి మనస్సు !! కాలం కదిలించింది కళ్ళలోని కన్నీటిని నా మది చేరిన నీ గుండె చప్పుళ్ళను గుర్తు చేస్తూ ఆశలకు అంతే లేకుండా పోయింది నువ్వు రావని తెలిసినా పిచ్చి మనస్సు ఉరకలు పెడుతుంది మది నిండ నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలను తవ్వి కళ్ళ ముందు కన్నీళ్ళుగా మార్చి గుర్తు చేస్తుంది పిచ్చి మనసు కన్నీటిలో తడిచిన అక్షరాలు కూడా నన్ను చూసి నవ్వుకుంటూ మసక బారుతున్నాయి నా ప్రేమకు ప్రేమించడమే తేలుసు నీ ప్రేమకు వంచించటమే తెలుసని నీ ప్రేమను వివరించే ఈ అక్షరాలు చెబుతున్నాయి !!అజయ్!! 05Jun14

by Ajay Pandu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5PZrR

Posted by Katta

28, మే 2014, బుధవారం

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు -9!! !!ప్రేమంటూ!! ప్రేమంటూ మనస్సును వంచించి వదిలేసి వేదనకు గురిచేసి వదిలించుకోవాలని చూస్తున్నావు ఒప్పు చేసిన తప్పని బలవంతంగా ఒప్పిస్తూ బ్రతికేస్తున్నావు నాకు బ్రతుకు లేకుండా చేస్తున్నావు దీనినే ఈ కాలంలో ప్రేమంటారా? నీవు చెప్పిన దానికి నేనే లొంగి నీ కాళ్ళ దగరకు వచ్చాక కూడ ఇలా చేస్తున్నావు నీకు న్యాయమేనా ప్రేమంటే మనస్సును ప్రేరేపించి ప్రాణాలను తీసేలా చేయటమేనా ఎందుకు నాలోకి వచ్చి మళ్ళీ నేను కాదు వచ్చింది నువ్వే వచ్చావు నాకు సంబందం లేదు అంటున్నావు. నేను లేకపోతే జీవితం లేదన్నావు ఇప్పుడు ఏమైంది. !!అజయ్!! 28MAY14

by Ajay Pandu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mr6f9q

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు -8!! !!ఎలా మరువగలను ప్రియా....!! కరిగిన కాలం కళ్ళముందే తారసపడుతున్నది నీ జ్ఞాపకాల రూపంలో మదిదోచిన మువ్వల సవ్వడి మరువ గలనా విరబూసిన వెన్నెల లాంటి నీ నవ్వులను మళ్ళీ చూడగలనా గల గలా పారే సెలయేరులా ప్రవహించే నీ మాటలను వినగలనా అవన్నీ నా కళ్ళముందే కదలాడుతున్నాయి ఆ కాలం కన్నులలో కలయతిరుగుతున్నది. నువ్వు నా తోడుగా లేకున్నా నీ జ్ఞాపకాలు నాతోనే సహవాసం చేస్తున్నాయి. నేను నిన్ను ఎలా మరువగలను ప్రియా.... !!అజయ్!! 13MAY14

by Ajay Pandu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ghuHfF

Posted by Katta

15, ఫిబ్రవరి 2014, శనివారం

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు -7!! !! ప్రేమకై !! ప్రేమన్నావు పరిణయమన్నావు పరిహాసం చేశావు పరిహారం లేదన్నావు లోకమే నేనన్నావు కన్నీటి లోకంలో ముంచావు ప్రాణమే నేనన్నావు ప్రేమే లేదన్నావు పంచభూతాలు ప్రక్షాళణ చేసినా దొరకనన్నావు. ముల్లోకాలు వినిపించేలా పిలిచినా వినపడలేదన్నావు వరాల జల్లులు కురిపించావు విరహమే మిగిల్చావు అనంత ప్రేమన్నావు అందనంత దూరంగా వెళ్ళావు ప్రేమ వికసించిందన్నావు వాడిపోదా అన్నావు దూరమవమన్నావు తారల్లో కలవమన్నావు తారల్లో చేరైనా నీకు తీయని అనుభూతిగా మారుతా తారా తోరణమై నీ కనుల వాకిట కాంతి రేకలుగా చేరుతా ప్రియా....... !!అజయ్!! !! 15FEB14 !!

by Ajay Pandu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MlYJRj

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు -6!! !!ప్రేమంటే!! యదను తొలిచావు మదిని గెలిచావు అదే ప్రేమన్నావు. మాటల గారడీ చేశావు నన్ను నీ ప్రేమలో ముంచావు. ప్రేమ కాంతులు కాంతులీనుతుంటే కన్నవారి కలలు కనుమరుగౌతున్నా కాలం నన్ను నీ తోడులోనే నడిపించింది ప్రేమ వలపులో నన్ను వంచించావో లేక బందించావా? నన్ను నీవుగా మార్చేశావు. నాకంటు ఏమీలేదు నువ్వు తప్ప అనేటట్టు చేశావు. ప్రేమ మేఘానివి నీవై నాపై ప్రేమ వర్షం కురిపించావు ప్రేమగ నీ చేతులతో తాకావు నీ ప్రేమ స్వరమే మందుగా ఇచ్చావు నేనంటే ప్రాణం అన్నావు నా ప్రాణమే నీవుగా మారావు నా కలల వాకిట్లో నీ ప్రేమను కల్లాపుగా చల్లావు నీవే అందులో అందమైన ముగ్గుగా మారావు. ప్రేమ అనే రెండు అక్షరాలను రెండు హ్రుదయాలు అన్నావు (నేను నువ్వు) ఒకే పదంగా మార్చావు. నేను అనే దానికి నువ్వును జత కలిపి ప్రేమ అన్నావు. యదను తొలిచావు మదిని గెలిచావు. !!అజయ్!! 12FEB2014.

by Ajay Pandu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bo89Ya

Posted by Katta

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Ajay Pandu కవిత

!!ప్రేమించిన మనస్సు-5!! !! గుర్తొస్తున్నావు !! గుర్తొస్తున్నానంటూ పదే పదే మాట్లాడి గుచ్చుతున్నావు నీ లోని ఆంతర్యం ఏమిటో? నాకు అర్దం కాదు నీ చెలిమిలో ఎన్ని క్షణాలు మాట్లాడినా కాలం విలువ మరిచినా ఆ క్షణాలన్నీ గతానికే అంకితం చేసావు గతాన్ని గుర్తు చేస్తున్నావు తీయని మాటలతో భాదతో ముగిస్తావు దానిలోనే ఆనందిస్తున్నావు నా కోసం అన్నీ విడిచాను అంటావు ఒక్క విషయంలో మాత్రం విడవనంటావు నాది అనుమానం అంటావు అవమానిస్తావు ఎందుకు ఇలా? ఇదేనా ప్రేమంటే ? ఎన్నో అభిరుచులను దూరం చేసుకున్నా నీ కోసం నీ అభిప్రాయం తప్పు అంటే ఓప్పుకోనంటావు ప్రేమ విఫలమైతుందని తెలిసి కూడా వదలనంటావు ప్రేమను ప్రేమించే నువ్వేనా ఇలా చేసేది మారవా ప్రియా నా కోసం నా ప్రేమ కోసం పదే పదే గుర్తొస్తున్నావు. !! అజయ్ !! !! 11FEB14 !!

by Ajay Pandu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK4PGq

Posted by Katta