కత్తిమండ ప్రతాప్ || వెంటాడే జ్ఞాపకాలు|| =========================== జ్ఞాపకాల దొంతరలో చెదిరిపోయిన కాగితం నల్లటి విష అక్షరాలను చిందిస్తూ పడగ విప్పి పాముల కాటేస్తుంది ఎక్కడో దాగిన ఆనవాళ్ళు అప్పుడప్పుడు బయలు పడుతున్నాయి క్యాస్ట్ ని క్యాష్ చేసుకునే కాగితాలన్నీ దొంతరలయ్యాయి వెక్కిరింతల నడుమ ఎన్నో దేహాలు నలిగి పోతున్నాయి చితి మంటల దగ్గర కూడా కులమే అగ్గై వెక్కిరిస్తుంది మసిబారిన హృదయాలు కాలంలో కాలిపోతున్నాయి చాకలి రేవులు, మాల పల్లెల్లు, మాదిగ పేటలు,పాకీ వీధులు నీ నోటినుండి ఉబికే నామకరణాలై వెక్కిరిస్తున్నాయి అహంకారపు జాడ్యం వెర్రి తలలు వేస్తుంది సాహిత్యం లో కూడా కుల పిలుపులు మలుపులై వెంటాడి వేదిస్తున్నాయి నాలుక విసిరే కుల పదాలు తుమ్మ ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి వాడల్లో ఇంకా అంటరానితనపు ఛాయలు చాప కింద నీరులా సాగుతున్నాయి తుంపర్ల మధ్య తడిచే హృదయాలు నలిగిపోతున్నాయి జ్ఞాపకాలు కాల గర్భంలో కలిసిపోతున్నాయి మట్టిలో కలిసిన దేహాలు మాత్రం చక్కగా నిద్రపోతున్నాయి చితి మంటల్లో కాలుతున్న శరీరాలు నవ్వుకుంటున్నాయి మారని రణాలు చూసి మరో లోకంలో స్వేఛ్చ కోసం మట్టి వాసన వెతుక్కుంటూ ... చీకటి లోకం అమవాస్యై కమ్ముకుంటుంది ========================= మే 13/2014
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHNX0j
Posted by Katta
by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iHNX0j
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి