పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Satish Namba లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Satish Namba లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మే 2014, మంగళవారం

Satish Namba కవిత

సతీష్ నంబా // 12-05-2014 నాకు జన్మనిచావు నా తల్లితండ్రివి కాదు నాకు తోడుగా ఉన్నావు తోబుట్టువు కాదు కలిసి ఉంటునావు చుట్టానివి కూడా కాదు అనీ వేళలా తోడుగా ఉంటావు స్నేహితుడివి కాదు సంతోషంలో దుఖంలో చేయూత నీచవు అన్నదమ్ముడివి కాదు నా పేరును నీ పేరుగా అనుకుంటావు నా ఇంటిపేరు నీది కనేకాదే అలసటలో సేదతిరుస్తావు ఆకలిలో అమృతం ఇస్తావు ఆనందం అందిస్తావు బాధను పంచుకుంటావు నామనస్సు నిదీ అంటావు నీ మనస్సులో నేను ఉన్ననాటావు నా ప్రశ్నకు నివు జవాబు అవుతావు నా ఆలోచనకు రూపంగా మరుతావు నా ఉన్నతికి సోపానం నివవుతావు నా జీవితానికి అర్ధం పరమార్ధం నివే నాటావు ఇంతకి నివు ఎవరు అని అడిగితె చిలిపిగా సిగ్గుతో ఛి పో అంటావు అప్పుడే కదా నీ నుదిటిపై ముద్దు పెట్టి ఇమే కదా నా అర్ధగిని అని గర్వంగా మనస్సులో ఆనందిస్తా నిన్ను నా గుండెలో దాచ్చుకుంటా .........

by Satish Namba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jmn024

Posted by Katta

7, ఏప్రిల్ 2014, సోమవారం

Satish Namba కవిత

సతీష్ నంబా || హృదయం|| పరుగులు పెడుతున్న సంద్రపు అలలలనురగలు ఒడిసి పట్టాలి అనుకుంటది లేత హృదయం ! ఉరుకులు పెడుతున్న కుర్రరక్తాన్ని చల్లార్చుకోవాలనుకుంటది కుర్ర హృదయం ! మధుర స్మృతులను నెమరు వెసుకుంటది ముదురు హృదయం ! రామా కృష్ణా, కృష్ణా రామా అంటూ కాలం వెళ్ళబుచ్ఛుతుంది ముసలి హృదయం !

by Satish Namba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ekHI1v

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Satish Namba కవిత

సతీష్ నంబా || ఆదిపరాశక్తిని || నేను కల్పవృక్షాన్ని నీవు నన్ను కల్పనగా చూస్తావు నేను అందాల హరివిల్లుని ! నీవు నన్ను అంధకారంలోకి నెట్టేస్తున్నావు నేను నిర్భయమైన నిజాన్ని నీ స్వార్ధంతో నిర్ధాక్షిణ్యంగా తోసెస్తున్నావు ! ఆడది జన్మనిచ్ఛే తల్లని తెలిసీ నాలో నివు నగ్నత్వాన్నిని చూస్తున్నావు మృగాడివై నేను ఆమృతకలశాన్ని నీ జీవనారంభానికి అంగట్లో సరుకులా నన్ను చూస్తావు అమ్మలా కాకుండా ! నేను అనురాగాన్ని రా ఆటబొమ్మని కాను నేను నీకు ఆసరానిరా అలసత్వాన్ని కాను నేనను అమ్మనే కాను ఆదిపరాశక్తిని కూడా ! అభిమానిస్తే ఆదరిస్తా ప్రేమిస్తే ప్రాణమే ఇస్తా అలుసుగా చూస్తే ఆణచివేస్తా పరీక్షిస్తే ప్రాణాలు తీస్తా నేను అమ్మనే కాదురా ఆదిపరాశక్తిని !

by Satish Namba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hWhkiw

Posted by Katta