పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

Shivaramakrishna Penna కవిత

నాకు నచ్చిన ఒక కవిత ఇది. దీనిని రాసిన కవి (కవయిత్రి) ఎవరో చెప్ప గలరా? ఓ ప్రేమ కవిత ! అతని చూపులవానలో నిలువెల్లా తడిసి మాయమవుతాను. ప్రేమ ముంగాళ్లను చుట్టుకుంటుంది. గుండె తడబడుతున్న అడుగులతో పరిగెత్తుతుంది. ఉద్విగ్న క్షణాల మోహం ముంచెత్తుతుంది. చిన్ని పెదాలపై జరజరాపాకుతూ నవ్వు పలకరిస్తుంది. ఆకాశం అమాంతంగా ఒడిలో మాయమైనట్లు భూమి తడిసిన మట్టి దుప్పటిని కప్పుకున్నట్లు పారిజాతాలు ఒళ్లంతా నిమిరినట్లు ఇంద్రధనుస్సు తనువంతా రంగులలదినట్లు తియ్యటి పరిమళానుభవం శరీరమంతా తన్మయీభావం ! గొంతు విప్పబోయిన నాపై మత్తు మత్తు పూలకుదురు. ఇరువురి పెదవుల స్పర్శతో ఊపిరి ఒక తృటి ఆగిపోతుంది. తేరుకున్న నేను అతడి అనురాగపు చూపుల్లో బందీ అవుతాను. అతడి చెవి వెనుక నా తడిముద్దు స్పర్శ ప్రేమకు భాష్యం చెబుతుంది. అదేమి చిత్రమో రగులుతున్న కొలుముల్లో ఎగిసిపడే చల్లని ప్రేమ ఇద్దరమూ విడివిడిగా మిగలక ఒకటిగా మలుచుకోవాలన్న తపన. ఆనందపు అంచుల్లో కొట్టుకోవాలన్న ఆర్తి. మేం, శరీరాల మూగ స్వరపేటికను తెరుస్తూ తెరుస్తూ మూస్తూ వినపడని శబ్ద రహస్యాల్ని ఛేదిస్తూ ... పొడుగు రాత్రిని తెల్లవారనీయలేదు దేహరాగాల కచ్చేరీకి తుదీ మొదలూ లేదు ఉద్విగ్న కాంతిలో మొలిచిన క్షణాలమై రేపటి గానం కోసం మళ్ళీ పుడతాం! *************

by Shivaramakrishna Penna



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dbd9hk

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి