పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//స్వప్నహేళ// ఒక దృశ్యం అద్దంలో కనిపించనిది మనసు కలగంటుంది పగలూ రాత్రీ ఒంటరిగా పదే పదే అదే స్వప్నాన్ని మోహించి తనలో తానే నవ్వుకుంటుంది అక్కడ ఆదృశ్యంలో ప్రతీకలేమీ ఉండవు ప్రేతాత్మలంతకన్నా లేవు ఉన్నదల్లా ఒక్కటే స్వాంతన అనతానంత సమూహాల్లోంచి ఏకాంతం లోకి హాయి గొలిపే సమ్మోహనం అదొక సంవేదన అదొక సంతోషం అదోక సుప్తావస్థ నాలో నేనే గూడు కట్టుకొని గుట్టుగా దాచుకొని విశ్రాంత రెక్కలు విదుల్చుకొని నేనొక పకృతి గీతమయ్యాక లోకమొక మధురోహల సంచయిక అంతలో అద్దంలో కనిపించని దృశ్యంలో నేనొక స్వప్నాల ప్రవల్లిక జీవితమొక లిప్త ప్రయాణ ప్రహేళిక....26.02.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hSbgWr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి