కవిత్వమూ -నేనూ నేను నేనే,నువ్వు -నువ్వే కవిత్వము నన్ను ఆవహించాక నువ్వే నేనై ప్రవహిస్తూ ఏకాంతంలో సమూహామై గెలుపోటములకతీతంగా .... నవ్వుతూ చేస్తున్న యుద్ధాలు మొగ్గ పువ్వై విచ్చుకోవడం ,మనసై పరిమళించడం ఓర్వ లేని కాలం గాయాల్ని చేస్తున్నా దుఃఖ సముద్రాల్ని క్షణంలో దాటే సాహసీ !జీవితం కవిత్వం తోడుంటే కడలి కెరటాలోక లెక్కనా ! అలజడుల పరీక్షల్ని ఆర్ద్రత తో దాటేద్దాం కాసే చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు వెలుగుతోటే కదా చీకటి వెన్నంటి ఉండేది చితిని చేరే లోపు ఎన్ని మైలు రాళ్ళు దాటాలో గుండెని ఊండగా చుట్టి పిండే సుఖ దుఃఖ వలయాల దృశ్యాలు .. గతి తప్పిన చిరుగుల్ని అతికిస్తూ ఊహాకూ వాస్తవానికి మధ్య ఊగిసలాటే కదా జీవితం ఒక అజ్నాతనేస్తం జ్నాపకం భుజం తడుతుంది చందమామ చుట్టూరా మబ్బుల తెరలు పున్నమి వెలుగుల్ని ఆపగలవా ఎన్ని బహిరంగ యుద్ధాల్ని జయించానో -నన్ను నేనింకా గెలవనే లేదు నింగి రాలిన నెల చినుకు నేలను తడపక మానదు మట్టిన మోలాకెత్తిన చిగురు వృక్షమై పెరగక మానదు చినుకుల్ని దోసిట్లో ఎంత కాలమాపగలవు గుండెల్ని కొంచెం మెత్తపడనీ!,కన్నీళ్లతో తడిసి ముద్దవనీ ! మనిషన్నాక ప్రేమించకుండా ఉండగలడా ప్రణాళికలన్నీ ఒక్క చిరు నవ్వుకే కాలపు కత్తి గాట్లు కనుమరుగవడం ఖాయం అనంత ఆత్మీయత ముందు -లోహపు గుండెలైనా కరిగిపోవాలిసిందే ఎంత ప్రయాణించినా తీరం చేరాల్సిందే ! మనిషైనవాడు ఎన్నటికైనా ప్రేమించాల్సిందే ! _డా .కలువకుంట రామకృష్ణ
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzajoE
Posted by Katta
by Ramakrishna Kalvakunta
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzajoE
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి