ఈనాటికవిత-73 ___________________________ రమాకంత్ వెంగల-పోలవరం-చలిజ్వరం కవులు క్రాంతదర్శులని ప్రాచీనుల మాట.సమాజాన్ని వైప్లవిక దృష్టితో చూచి స్పందించవలసిన బాధ్యత కూడా కవిపై ఉంది.ఎ కవి అయినా వర్తమానన్ని వదిలి స్పందిస్తే అతనో కాలనికి గడ్దకట్టుకు పోయినట్టుగానే భావిస్తరు.అందువల్ల కవికి వర్తమానస్పృహ కూదా చాలా అవసరం.రమాకాంత్ ఒక ప్రధాన చారిత్రకసందర్భంలో నిలబడి స్పందించిన కవిత ఇది.అరవైయ్యేళ్ల కల,ఉద్యమం సాకారమై తెలగాణా ఆనందోత్సాహాలతో ఉన్నప్పుడు-మరో కన్ను రక్త సిక్త మౌతుంది.ఈ సందర్భంలో బాధ్యతగా స్పందిస్తున్నారు రమాకాంత్. నియంత్రిస్తున్న నేత్రాల్ని పరాజితుల్ని చేస్తున్న.. దుస్స్వప్న౦.. పోలవరం! అది నిర్మితమవుతున్న క్రమంలో.. వైద్యమందని గూడాలను.. వణికిస్తున్న చలిజ్వరం!! విభజన నేపథ్యంలో గిరిజనుల ఉరికంబం! ఆస్తుల పంపకంలో ఏలికల వర్తకం! తూనికరాళ్ళలో ఏదో మోసం!! ఫలితంగా.. గోదారి పదఘట్టనల కింద నేలమట్టమవుతున్న పూరిగుడిసెలు! తెలంగాణా తుదిఘట్టంలో.. తాకట్టుపెట్టబడ్డ ఆదిమనుషులు!! ఈ పీడకల నిజమైతే.. ఇక..విముక్తి నిర్వచనం.. 1947- అర్థరాత్రిస్వాతంత్ర్యం! 2014- అర్థరహితస్వాతంత్ర్యం!! సందర్భాన్ని బరువుగా అందించగలిగిన వాక్యాలున్నాయి ఈ కవితలో."ఆస్తుల పంపకంలో ఏలికల వర్తకం! తూనికరాళ్ళలో ఏదో మోసం!!""1947- అర్థరాత్రిస్వాతంత్ర్యం! 2014- అర్థరహితస్వాతంత్ర్యం!!"చరిత్ర మిగిల్చిన ఒక సందేహాన్ని గురించి నిలదీయటం కనిపిస్తుంది ఈ కవితలో.వస్తువుని చాలా బలంగా అందించటం కనిపిస్తుంది.కాని కవితకు కేవలం వస్తుబలం చాలదేమో తాననుభవించిన సాంద్రతని అంతే దారుఢ్యంగా వ్యక్తం చేయగలగాలి.రమాకాంత్ ఆదశకి చాలా దగ్గరలో ఉన్నారు.చాలామందిలో శబ్దంపట్ల భ్రమ ఒకటి ఉంటుంది."వరం-జ్వరం"లంటి జంట అలాంటిదే.ఈ కవిత ,కవి ఆపరిధి దాటారు.కొన్ని సార్లు సార్థకం కాని ప్రాసల జంట కవిత బలాన్ని తగ్గిస్తుంది కూదా. మంచికవితను అందించినందుకుమాత్రమే కాదు,సరైన సమయంలో స్పందించినందుకు కూడా రమాకాంత్ గారికి అభినందనలు.ఈకవి నుంచి సాంద్రమైన మరిన్ని కవితలని అపేక్షించడం అత్యాశకదు.
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1clmDZk
Posted by Katta
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1clmDZk
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి