అన్ని వేదములోనె ఉన్నవి..... దేహయంత్రములోని తంత్రము, దేహికైనా తెలియునా ! సారథిని రథమే నడుపు వైనం, దారికైనా తెలియునా ! వేదములు, మహిమలు, మతము ఉనికికి మూలమన్నది అసత్యం, మృత్యు భయమే మూలమని, ఆస్తిక వాదికైనా తెలియునా ! అన్ని వేదములోనె ఉన్నవి, కాని గతి అప్రాచ్యమే ! కులభేదమే మన సృష్టి, చతుర్వేదికైనా తెలియునా ! దేవునికి, మనిషికి నడుమ వారథిలోనె కలదు కుతంత్రము ! స్వరము తప్పని మంత్ర భావం, పూజారికైనా తెలియునా ! ఒక్క భాషే ఎరుగు దేవుడు, సర్వ సృష్టికి మూలమా ! భూసురుల వంచన, పచ్చి హిందూ వాదికైనా తెలియునా ! వేయి పడగల నాగరాజులు, విషము చిమ్ముటె ధర్మము ! ఆ శేష శయనుని కరుణ ఇది, బహుజనులకైనా తెలియునా ! అమానుషమ్మగు దోపిడీకే, కులపు నిచ్చెన నీతులు ! ఇన్ని వ్యూహపు చతురతలు, ఏజాతికైనా తెలియునా ! 'దైవ' భాషను వదలి, విప్రులె మ్లేచ్ఛ భాషలు నేర్చినారు, 'స్వధర్మ' మంటే ఏమిటో, గాయత్రికైనా తెలియునా ! ******************** "శిశిర వల్లకి" (2012) గజళ్ళ సంపుటి నుంచి...
by Shivaramakrishna Penna
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kHHK7y
Posted by Katta
by Shivaramakrishna Penna
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kHHK7y
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి