పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

Sriramoju Haragopal కవిత

పాట మునుం నువ్వెందుకు వానలెక్క వొచ్చిపోతవు ఈ చలికాలం కొసల ఎండిన ఆశల పండుటాకులు కన్నీటి గాలిచెమ్మకు తడై బరువెక్కిన గుండెలు వెక్కి వెక్కి రాలిపోతున్నయి ముందుగ ఎరుకజేస్తె నీదేం బోయేదుండె పొక్కిలైన ఇల్లు,వాకిలి నవ్వులతొ అలికివుందునుగద మామిడిపూలవాసనల్నిదాచివుంచుదు, గోగుపూల దండలు దోర్నాలు కడుదు నిమిషమన్న నిలిచివుంటె బాగుండు నువ్వు రెప్పలద్దుకుని ముఖమన్న చూసుందును పాలగోకులెక్క యాదిలెన్నొస్తయి కొండవాగు తీర్గ మనసెంత పొర్లిపారుతది అరుగుమీద ఉలికిపాటు నిద్రలో కలవరింతలు నీ కడియాలు కైగట్టి పిలుస్తె ఎట్ల మల్ల కనపడవు, రమ్మనవు 01.03.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pMZuSZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి