జూదం ___________________ నీగొంతు పాటలుపండేపొలంలా గోదారి నీళ్లతో నిండాల్సిందే మీ పొలాలు పన్నీటి కడుపుతో పచ్చదనాన్నిమోసే గర్భిణులై మెదలాల్సిందే ఇవాళ్ల అది నాచితినుంచి కావడమే ద్రోహం రూపాయివెలుగులతో పనిలేక పచ్చనికళ్లతికించుకుని చెట్లకుపుట్టిన పచ్చనికాయల్లా ప్రవాహగీతాలమయ్యే తేనేటీగల్లా చెట్టునానుకుని పుట్టిన అడవిపద్యాలం ఇవాళ్ల నీ మహానిర్మాణం కింద నాబతుకు మునిగి పొవడమే విషాదం పందెం ఎవడైనా కాయొచ్చు పైయెత్తు ఎవడైనావెయొచ్చు సొమ్మెవరిదనేదే మీమాంస నన్నుదిద్దడానికొక్క అక్షరం గుడికానోడివి వెచ్చని పచ్చదనం మీద నీ రాబందు రెక్కనెందుకు కప్పుతావు నువ్వు నిలువెల్లా రూపాయివైతే కావొచ్చు రాజ సిOహాసనానివై తరలొచ్చు రామున్ని ప్రేమించి భక్తుడివైతే కావొచ్చు నా ప్రాణాదుల్నెందుకు వారధికింద ముంచేస్తావు ఓ కాలం బొటనవేలునికోసింది నీ కాలం గొంతునికోస్తుంది
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dbd90N
Posted by Katta
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dbd90N
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి