పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

Usha Rani K కవిత

మరువం ఉష: మహాభారతం - మరో దృక్కోణం -------------------------------------------- [గమనిక: ఈ కవితకి ఆధారం పలు మహాభారత గాథలు. కొంత నా వూహ జోడించినా మూల కథల్లో మార్పు చేయలేదు. రవ్వంత సందేహంతో, కొండంత ధీమాతో (అంటే తగినంత జ్ఞానం వొంటబట్టాకనే రాసానని) వెలికి తెచ్చిన వచనం ఇది! "సాహితీసేవ" లో ప్రచురించి ఇక్కడా కలుపుతున్నాను. And, I don't normally cross-post at all. This is the first time am adding in a desire to get more views (please I am not looking for appreciative feedback rather few complementary points from the great epic, and I always cherish on the rich Indian mythology)] -మొదటి తరం- అతిలోక సౌందర్యవతిని అపరిమిత జ్ఞానసంపన్నురాలను గంధర్వకాంతను గుణగణాల అధికురాలను "అద్రిక"ను సృష్టికర్తకు నను మించిన సృజన ఇక మిగలలేదా? ఆతని మానసాన మరొక యోచనకు సృష్టి లోకరీతిని మార్చు వినూత్న ప్రయోగారంభం సమస్త ప్రాణి జన్యు వ్యవస్థకి సవాలేమో? తొలిజీవ పరిణామమగు "మత్స్య" రూపిణినై సప్తసముద్ర వాసినయ్యాను మానవోత్తమ శౌర్యపరాక్రమ వసురాజ పరోక్షాన పురుష రేతస్సు సంగ్రహించాను జలచర గర్భాన మానవ కవలల నవ్య సృష్టి చేసాను -రెండో తరం- దాశరాజ పుత్రికనై కాళి నామమున ఎదిగాను జన్మ కారణాన "మత్స్యగంధి"గా మరులు గొలిపాను యోగి నందు కాంక్ష రగిలించి యోజనగంధినయ్యాను దైవమానవ సంగమ నూతన వంశవృద్దికి అంకురమయ్యాను -మూడో తరం- కానీనుడను కృష్ణద్వైపాయనునిగా ఉద్భవించాను వేదాలను, పురాణాలను విభజించి "వేదవ్యాసుడ"నయ్యాను భారతాన లేనిది జగతి నందులేదన్న నానుడిగా రచనచేసాను ప్రతి పాత్రయందు తరతరాలు చెప్పుకొను కథ మలిచాను మూడు తరాల ఆ చరితనందు ఎన్ని సాంఘిక న్యాయాలు? ముందు తరాలు అందుకోను మరిన్ని శాస్త్రీయ సూచనలు, మహాభారతాన తరగని నిధులు ఈ విలువైన నిక్షిప్త గాథలు! ******************************************* జీవ పరిణామం : హుమన్ ఎవొలుతిఒన్ జన్యు : గెనెస్ రేతస్సు : స్పెర్మ్ కానీనుడు : పెండ్లికి ముందు కన్యకు పుట్టిన వాడు 02/03/2014

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OQ5HzG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి