నాగుంబాము గోధుమ రంగు వన్నె నున్నగ జారిపొయ్యేటి తోలు ఇగ పడిగె ఎత్తుతె దాని అందమే వేరు ఒక్కసారి దాని మొకం సూడుండ్రి తేట గల్ల కండ్లు ముత్తెమంత ముక్కూ మూతీ రెండు ఏళ్ళసందుల్ల గరుకపోసలెక్క నాలికె పరుసుకుంటె చేతిల కట్టె అంత ముడుసుకుంటె సుట్టకుదురంత దాని గదువకింద చందనం గీతలోలె నలుపుతెలుపు చారలు దాని తల మీద మణులు పీకేసిన బర్రలోలె కృష్ణగుర్తులు బుస్సబుస్స లేసుడు మిట్టమిట్ట జూసుడు సర్రసర్ర పోవుడు దాని పుట్టువడి లక్షణం ఆలుమగల అనుబంధ కావ్యం దాని జంట నాట్యం నాగస్వరం ఊదుతె ఒంపులు తిరిగే దాని అమాయకత్వం శివుడు నాగహారమని మెడల ఏసుకున్నడు విష్ణువు శేషుని గొడుగు పట్టిచ్చుకున్నడు దానికి పడిగె తప్ప పగెక్కడిది? అది ఏం దాసి పెట్టుకున్నదని పాత పుట్టలు తవ్విపోత్తండ్రు ఏం మంచి చేసిండ్రని కొత్తపుట్టలల్ల పడిగెలేసి పాలువోత్తండ్రు దాన్ని అనుడు గాదు అంటే గింటే మనుషుల్నే అనాలె అది ఒక్కసారి బుస్సుమంటే బొండిగ విసుకుతిరి అరె అదేమంటది! ఆకలైనప్పుడు సర్రసర్ర పాక్కుంట వొయ్యి ఐతె ఓ కప్పను లేకుంటె ఓ ఎలుకను పట్టుక తింటది నేల అడుగున అడుగు జాగల మలుసుక పంటది అది కాళ్ళురెక్కలు పోడగొట్టుకోని ఎన్నుపూసను నేలనిచ్చెన చేసుకొని బతుకును ఈడ్సుకపోతది కదా! అరె మనుషులూ! ఎంత పాపం జేత్తిరి మీ భయాలకు దాని ఉసురు దీత్తిరి పాలువోసిన చేతులతోని పానాలు దియ్యవడ్తిరి జనమేజయ సర్పయాగాలై ఉదంకుల కుట్రలై రురుల ప్రతీకారాలై ఆస్తికులైతే ఏం లాభం ఆస్తీకులు గావాలె! లేకుంటే మీకంటె ముంగిసలే నయం ఆకలైతె సంపుక తింటయ్ ఆపతైతె కలిసి ఉరుకుతయ్ తేది: 02.03.2014 (ఆస్తీకుడు= జనమేజయ సర్పయాగాన్ని ఆపించిన వాడు, ఆస్తికులు= దేవుణ్ణి నమ్మే వారు)
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzqjH6
Posted by Katta
by Boorla Venkateshwarlu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fzqjH6
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి