పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

Sravanthi Itharaju కవిత

సౌగంధిక జాజరలు" స్రవంతి ఐతరాజు" " మల్లికా ఓ మల్లికా" మల్లికా..ఓ మల్లికా.. మూగబోయావా..మౌనమించావా.. చెదరిన వీణియలా..శృతితప్పిన రాగంలా.. మనసులేని మమతలా..మమతలేని మనువులా.. నా జడలో చేరి వూసుల రాశులు నింపడం లేదుగా.. మదిలో నా గదిలో సువాసనల పరిమళాలొకించడంలేదుగా.. ఏం ఎందుకని?నా రాజు..ఆ రేరాజు..కనిపించడంలేదనా??? లేక మా అలవాటు సరాగాలు అనురాగాలై పలకడంలేదనా??? ఔన్లే నా మనసు చెలికాడిని చూసి సిగ్గిలి నా నవ్వుల్లో దాక్కునేదానివి కంటిచూపుల్లోంచి తనపై వ్రాలేదానివి నా కురుల సింగారానివై రాణిలా గునిసేదానివి.. తన హృదిలో నా మదిలో గిలిగింతలు పెట్టేదానివి తనచేతులనుండీ త్వరపడి నా తలపై తలంబ్రాలయ్యేదానివి ఓస్! నీ మౌనం శాశ్వతమనుకోకు మా.. త్వరలోనే నా రాజు ... నీ మౌనంలో మోహనాలు పలికిస్తాడు సుమా!!!

by Sravanthi Itharaju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eNRwju

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి