పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

R K Chowdary Jasti కవిత

జాస్తి రామకృష్ణ చౌదరి ఆశ్రమంలో ఆ గొంతు ఉపన్యసిస్తుంటే నా ఊపిరే సంగీతమై నా అణువుల్ని ఛేదిస్తూ నాలోకి ప్రవహిస్తుంటే నేను నాలోంచి నిష్క్రమిస్తూ.... నన్ను నేను త్యజించుకుంటుంటే నా హృదయం తేలికైపోయినట్టు ఆకాశం నన్ను తడుముతున్నట్టు స్వర్గం నన్ను హత్తుకుంటున్నట్టు నా జీవితం వెలిగిపోతున్నట్టు ఒక అర్ధం కాని అనుభూతి! నేను ఆ మైకంలో మునిగి తేలుతున్నప్పుడు నేను నా ప్రపంచం బయట మరో ప్రపంచంలో కళ్ళు తెరుస్తున్నప్పుడు నన్ను ఆకర్షించిన శక్తి నన్ను ఆక్రమిస్తున్నప్పుడు ఒక తెలియని పరవశం! ఆ ఆధ్యాత్మిక ధ్రవ్యాల మైకానికి నేనిప్పుడొక బానిసని కన్నీళ్ళు ఆవిరైపోతూ ఉంటే మొహం మీద కృత్రిమంగా పుట్టుకొస్తున్న నవ్వుని. ఆ గంజాయి తోటలో మరణించడానికి మళ్ళీ మళ్ళీ వికసిస్తున్న పువ్వుని. 28FEB2014

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eO88aT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి