తిలక్/Unsaturated Soul ---------------------------- ఈ రోజు నా ఆత్మ నగ్నంగా కాలుతోంది నీ ఆలోచనల కొలిమిలో ఇన్నాళ్ళు లోనెక్కడో చెదలుపట్టి తెరమరుగైన ఓ కణంలా దేహాన్ని కనిపించని మైనపు ముద్దలా తానారిపోయి వెలిగిస్తోంది వేర్లు కనిపించని చెట్టు దివిటీ అదృశ్యపు అగ్గి ఎన్నిసార్లు పడుకుందో ఈ దేహం నిన్ను వీడి నడిపించేదే నువ్వని తెలియక ఆత్మ నగ్నత్వాన్ని చూడలేని శరీరమూ క్షణికావేశపు అంధనిగూడంలో కొన్ని క్షణాలు దేహాన్ని పొరలుపొరలుగా చీలుస్తూ కొన్ని నిశ్శబ్దాలు వాటివెనక పురాతన జ్వలితాలు ఎన్నిమార్లు కాలినా సరితూగని ఆత్మ సందేశంలా నేను. తిలక్ బొమ్మరాజు 01.03.14
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ePZtVd
Posted by Katta
by Thilak Bommaraju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ePZtVd
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి