రెండు గింజలు చల్లి వెళ్లి పోయారు వాళ్లు చేసిందేమీ లేదు రెండు గింజలు చల్లి వెళ్లి పోయారు ఎండిన నేలలో గింజలు నీటిని తడుముకుని చిగురు తొడిగి పూలుపూచి మాటల గింజల మూటని నగరంలో ఎగరేసాయి ఎండిన ఆకుల్లా మాటలు గాలిలో షికార్లు చేసాయి మాటలు మాటలు ఎక్కడ చూసిన మాటలు వృక్షాలని నేలకూల్చాయి నీడలని దాచేసాయి నెత్తురు చవిచూసాయి ప్రాణాలు తీసాయి వాటి అర్ధం వెతికే పనిలో నగరం నలిగిపోయింది ప్రతీ ముఖంలో మాటలు నత్తి నత్తిగా పలుకుతున్నాయి ద్రోహం వలతో మాటల ఎరలు ఎర్రగా మెరుస్తూ తలలాడించాయి ఎండిన నదుల నిండా మాటలు మురికిగా పారుతున్నాయి కనిపించిన మనిషి బుజాలేక్కిన మాటలు బుజాలని నరుకుతున్నాయి పల్లేరు కాయల్లా గుచ్చుకుంటున్నాయి మాట మాటకి వెక్కిరింతలు విడిపోలేదేమని కుశల ప్రశ్నలు ఇంకా మాటలు ఊరుతునే ఉన్నాయి సముద్రాలు సృస్టించి ఇసుకమేటలు వేస్తున్నాయి చీకటిలో చుక్కలు ,పక్కటెముకలమీద చురకత్తులు గొంతుకి ఊరి తాళ్ళు సిధం చేస్తున్నాయి అయిన అందరూ మాట్లడుతూనే ఉన్నారు వాళ్ళు చేసిందేమీ లేదు రెండు గింజలు చల్లి వెళ్ళిపోయారు
by Renuka Ayola
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o45QuW
Posted by Katta
by Renuka Ayola
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o45QuW
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి