మోహన్ రుషి // వేసవి రాత్రి // గ్రిల్స్ గుండా చూస్తుంది జీవితం, నిన్ను. జాలిగా. హేళనగా. భరిస్తుంది నీ మాటల వాంతిని. సహిస్తుంది నీ కలల భ్రాంతిని. చేసే మోసం గమనిస్తుంది నిశ్శబ్దంగా. వేసే వేషం పసికడ్తుంది నిశితంగా. ఏడ్పుకు నవ్వుకుంటుంది బిగ్గరగా. నవ్వునేనాడూ అల్లుకోదు దగ్గరగా. ఒకటే జీవితమని తెల్సీ రెండుగా బతుకుతున్నప్పుడు. రెండవ ప్రపంచంలో ఒంటిగా మిగులుతున్నప్పుడు. తడిని పూడ్చి తన్మయత్వం పొందుతున్నప్పుడు. నువ్వెవడివో తెలిసినా తెలియక, తెలియకా తెలిసి భ్రమిస్తున్నప్పుడు. **** వెనుదిరిగినప్పుడు చప్పుడు చేసిన తలుపుని వింటే, ఇక, అప్పుడు, అదే గ్రిల్స్ గుండా జీవితంలోకి ఎలా చూడాలో తెలుస్తుందనుకుంటాను. 1.5.2014
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SbmJtM
Posted by Katta
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SbmJtM
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి