పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Gouri Lakshmi Alluri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gouri Lakshmi Alluri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జూన్ 2014, సోమవారం

Gouri Lakshmi Alluri కవిత

//సత్యమైన చూపు // ప్రాంతీయ కళ్ళజోళ్ళు ధరించి వారసత్వ వైరాలు మొయ్యొద్దు ఒక పక్క నిలబడి ఆగ్రహ పడిపోయి రెండో పక్క చూడనని భీష్మించొద్దు కక్ష, కార్పణ్యాల్ని నయనద్వయంలో నింపి సత్యమైన చూపును కోల్పోవద్దు విద్వేషపు జ్వాలలు ఎగిసి నిలువునా మననే కాలుస్తాయి విజ్ఞత మరిచి విషపు వాదం చేస్తే చదువుల సరస్వతి చిన్నబోతుంది పట్టుదారాల్లాంటి మానవ బంధాల్ని నిభాయించాలి మనం నిరంతరం చరిత్రలో అన్యా యం - నివారణకై పోరా టం న్యాయం జరిగే క్రమం - మరో కొత్త అన్యాయం మానవ జాతి పరిణామం లో చర్విత చర్వణం పేపర్ లో వండి వార్చే వ్యాసాలు వేదాలు కావు టి వీ ల్లో వాదించే వాళ్ళు ఒకే కార్లో తిరిగి వెళతారు మన చేతుల్లో లేని రాజకీయ నిర్ణయాల్లో ప్రజల భావోద్వేగాలు నిమిత్త మాత్రం ఒక తల్లి మొక్కకు రెండు సిరసుల చందం ఒక మాతృ భాషకు రెండు యాస లందం సహనంతో సాగడం అందరికీ అనివార్యం సౌ భ్రా తృ త్వం రేపటి తక్షణ అవసరం

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i00O48

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Gouri Lakshmi Alluri కవిత

//JUDGEMENT// కులమేదని అడగడం అనాగరికం ఒకనాడు ప్రాంత మేదనడం అనివార్యం ఈనాడు దేశమంతా మనదే నన్నది పాత పాట నువ్వు పుట్టిన చోటే నీదన్నది నేటి మాట పరీక్షల పరుగులో నెగ్గి రావడం పాపమట వెనక బడిన వాడికే ట్రోఫీ న్యాయమట పాలకుల అన్యాయలకిది పరిహారమట ఇది ఒప్పందం తప్పిన పెద్దల శిక్షట ప్రైవేటు, వాణిజ్య వర్గం పరిధి కాదట రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకే భేదమట నాటి సర్కారీ కొలువుల కేటాయింపు తప్పట విద్య నేర్చిన చోటుకే వారి బదిలీ తప్పనిసరట పొరుగు రాష్ట్రం వారు సోదరులట తోటి తెలుగు వారే పగ వారట వారు స్వస్థలాలకు పొతే చాలట కన్నుకు కన్ను కొత్త రాజు తీర్పట జాతి, మత, కుల వివక్ష మొన్నటి కధ ప్రాంతీయ వివక్ష సరి కొత్త నేటి కధ

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oehBk0

Posted by Katta

23, మే 2014, శుక్రవారం

Gouri Lakshmi Alluri కవిత

//సహజ ప్రవాహం // నలుగురితో నారాయణా .. అది సామాజిక బంధం పది మందితో పదరా.. అదే ఆనంద మంత్రం కష్టమొస్తే కళ్ళు సానుభుతికై ఆశగా చూస్తాయి ఇతరుల చల్లని సేద దీర్పును ఆశిస్తాయి సిన్మా కెళ్తే హాలంతా నిండితేనే బావుంటుంది క్రికెట్ స్టేడియం క్రిక్కిరిస్తేనే మజా వస్తుంది కాల్లో ముల్లు దిగితే పక్క వారి ఓదార్పు నొప్పిని తగ్గిస్తుంది గుంపులో సానుభూతి సహజ వెల్లువై ప్రవహిస్తుంది రోడ్ పై పడగానే నాలుగు చేతులు నిన్ను లేపుతాయి బస్సులో సొమ్మసిల్లితే వాటర్ బాటిల్స్ లైన్ కడతాయి ఎవరికైనా సమూహమే ధైర్యం ఇస్తుంది సమాజమే ఆత్మ విశ్వాసం కలిగిస్తుంది చివరాఖరికి మనుషులందరిదీ ఒక్కిల్లే ఆపదలో ఆదరిస్తుంది సంఘం అమ్మల్లే తోటివారితో సామరస్యం ఉండాలి రక్షల్లే అప్పుడే అందరం నిద్రిస్తాం పాపలల్లే గుంపును నడుపుకు పోయే పనవుతుంది నీ వల్లే అందరి మనసుల్ని కలుపు ఒక గొలుసల్లే జీవుల్ని అనుసంధానిస్తుంది ఒక ఏకత్వం అందరిలో ఉంటుంది కనబడని దైవత్వం

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1t1drLI

Posted by Katta

21, మే 2014, బుధవారం

Gouri Lakshmi Alluri కవిత

////చల్లని తల్లి //// ప్రతి ఊర్లోనూ ఉంటుంది ఓ గ్రామ దేవత పాడి పంటలతో ఆరోగ్యాన్నిచ్చి దీవించే అమ్మ తల్లి పళ్ళూ, పానకాలతో నైవేద్యం తీసుకునే అమ్మ రూపం పండగ లప్పుడు వంటింటి మూలే ఆమె నివాసం చూడండి..మనూరి చల్లని తల్లి మనతోనే సిటీ వచ్చింది వంటింట్లో ప్రేమగా, ధీమాగా ఒదిగి కూర్చుంది పాలు, పెరుగు దాచి పెట్టి మనింటిని పాడిల్లు చేస్తుంది కూరా, నారా, పచ్చళ్ళతో అది అక్షయ పాత్రే అవుతుంది ఎమర్జెన్సీ మందులతో ఒక మెడికేర్ సెంటరవుతుంది పళ్ళూ, జా మ్, రసాలతో పళ్ళ తోటవుతుంది హిమాలయాలను సృష్టించి పిల్లలకి హిమ క్రీములిస్తుంది ఉద్యోగినుల చేత అతిధి దేవుళ్ళకు ఆతిధ్య మిప్పిస్తుంది మండు టెండలో మన సేద దీర్చే నట్టింటి కాశ్మీరం ఇల్లాలికి చేయూతనిచ్చే వంటింటి భండాగారం వంటలు స్టాక్ పెట్టుకుని ఇల్లాళ్ళను ఊళ్లకు పంపుతుంది చల్లని కూల్ డ్రింక్ లిచ్చి అందరినీ అమ్మల్లే అలరిస్తుంది మొక్కండి అప్పుడప్పుడూ ఈ ఇంటింటి చల్లని తల్లికి నమ్మండి నిర్భయంగా వస్తువునైనా దైవస్వరూపంగా తలిచి

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gki6b7

Posted by Katta

1, మే 2014, గురువారం

Gouri Lakshmi Alluri కవిత

ఏప్రిల్ 20 న ఆంధ్ర నాటక కళా సమితి, విజయవాడ వారు ప్రదానం చేసిన శ్రీమతి తటవర్తి వరలక్ష్మి స్మారక పురస్కారం అందుకుంటున్న డాక్టర్ సి. భవానీ దేవి.

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pRfiGO

Posted by Katta

19, ఏప్రిల్ 2014, శనివారం

Gouri Lakshmi Alluri కవిత

/////కార్పొరేట్ పాలిటిక్స్ ///// రాజకీయ పార్టీలు లాభార్జన వ్యాపార సంస్థలు కోట్ల పెట్టుబడిదారులు ఆ సామ్రాజ్య పు సీఈఓలు వృత్తి ప్రావీణ్యాన్ని బట్టి ఉద్యోగులు కంపెనీ మారతారు గెలిచే సత్తా చూపి నాయకులు పార్టీ మారతారు సిద్ధాంతాలూ, మూల సూత్రాలూ పాత కాలం పాటలు దేశ భక్తీ, ప్రజా సేవా అరిగి విరిగిన రికార్డులు గెలుపే లక్ష్యంగా పిల్లి మొగ్గలేసే ప్రోయాక్టివ్ లీడర్లు విన్ విన్ షేర్ ల వాటాలే పార్టీల పొత్తు పొట్లాలు నిజాయితీ పరులు కండువా తీసి టీవీ చూడాల్సిందే పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లు కొత్త చరిత్ర రాసుకోవాల్సిందే కుల పెద్దలైతే చాలు బడా నాయకులై పోవచ్చు కుర్రాళ్ళ తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించొచ్చు పెద్ద పెద్ద ముఠాలు పాలనాధి కారానికై బరిలో నిలుస్తాయి గెలిచాక పవర్ ప్రస్థానం లో జట్లు కడతాయి అధికారం దక్కాక ప్రత్యర్ధుల్ని జైలు కంపుతాయి చివరికి ప్రజల్ని ఫూల్స్ చేసి కేసులన్నీ నీటిబుడగ లౌతాయి మాజీ మంత్రుల అవినీతిని కొలిచే మీటర్లు లేవిక్కడ తక్కువ రీడింగ్ చూపిన వాడికి ఠక్కున వోటెయ్యడానికి పార్టీ టికెట్ల పందేరం ఒక నాటి రవికెల పండుగ చందం రెండు పార్టీల నుండీ ఒకరే నామినేషన్ - బేరం కుదిరితే సీట్ ఫైనలై జేషన్ అమ్ముడు పోయిన వార్తా పత్రికల్లో నిష్పాక్షికత నిండు సున్నా అవి పోటీ పడి ప్రజల కయోమయం మరింత పెంచునన్నా.. స్వార్ధ మూర్తుల ఎన్నికల జాతరలో వోటర్లు తప్పిపోయిన పిల్లలు ఉత్తమ నాయకులను ఎన్నటికీ ఎన్నుకోలేని అమాయకపు జీవులు

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eKH0Qt

Posted by Katta

25, మార్చి 2014, మంగళవారం

Gouri Lakshmi Alluri కవిత

క్షణాల శాశ్వతత్వం ============ విడిపోయాం ! నిజమే ! మళ్ళీ కలిసే ప్రసక్తే లేదు ! అదీ నిజమే ! అయితేనేం? మనం స్నేహించిన కాలం లో జీవించాం..గుర్తుందా ? మనం కలిసున్న కాలం ఎంతో కొంత ఉంది కదా ! గంటలో ...రోజులో....నెలలో ... ! నెయ్యంతో పంచుకున్న ఊహలు, ఊసులు పగల బడి నవ్వుకున్న నిమిషాలు... మనసు నలిగినప్పుడు ఓదార్చుకున్న క్షణాలు నేనే నువ్వన్నట్టు, నువ్వే నేనన్నట్టు ఒకరి నొకరు సహానుభూతించిన సందర్భాలు మౌనంగా పక్క పక్కన కూచున్న ఏకాంతాలు నా మనో మందిరంలో అందాల చిత్రాలు అమృతం లాంటి మన సాంగత్యాన్ని గరళం లాంటి నీ నిష్క్రమణాన్ని నా మనసు హంస లా వేరు చేస్తుంది నాటి అద్భుత ఘడియల్ని నెమరేస్తుంది జ్ఞాపకాల పరిమళాల్ని ఆస్వాదిస్తుంది కాల కూటం లాంటి నిర్గమనాన్ని త్యజిస్తుంది చర్విత చర్వణాల పై ఆసక్తి లేదు కా లం చేసిన గాయాలపై అచ్చెరువూ లేదు నిందా, నిష్టూరాలపై అక్కర అసలే లేదు అంతర్లోకంలో ఆ నాటి స్మృతులు నిక్షిప్త నిధులు ఆజన్మాంతం గుండె గదిలో అత్యంత పదిలాలు

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OUsSIx

Posted by Katta

1, మార్చి 2014, శనివారం

Gouri Lakshmi Alluri కవిత

// టాక్ టైం // కాల్ లో ముళ్ళుంటాయి ఒకోసారి గుచ్చుకుని గుండెల్ని సలుపుతాయి మాటలే కదా అనుకుంటామా మంటలు పుట్టిస్తాయవి కారు చౌకే కదా అని రింగ్ చేశావా ? అధిక ప్రసంగాలకి ఆహుతవుతావు అప్పుడప్పుడూ కాల్స్ మైండ్ ని బ్లాస్ట్ చేస్తాయి మొబైల్ నుంచి మిస్సైల్స్ దూసుకొస్తాయి కొందరు మాట్లాడాక సైకియాట్రిస్ట్ ను కలవాలి కొన్ని ఫోన్లు పెట్టాక నిష్టూరాలు వెంటాడతాయి మిస్ డ్ కాల్స్ మోసానికి బలికాకు నీ చేత్తో నిన్నే చరిచే చమక్కులవి వాగుడు విద్యుత్తై ప్రవహిస్తే నీ మాట నీకే షాక్ కొట్టి కాల్చొచ్చు టైం పాస్ కని గాల్లోకి గాసిప్ లొదలకు టైం బాంబులై నిన్నే గోల్ చేస్తాయవి విలువైన పలుకులు వ్యక్తిత్వపు మెరుపులు వ్యర్ధపు మాటలు నీ రూపుకు చెరుపులు

by Gouri Lakshmi Alluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJm31G

Posted by Katta