కుళ్ళిన పళ్ళతోట -7 ___________________ఆర్క్యూబ్ పండ్ల దావకాన చిలుకూరి గుడైద్ది మౌత్ మిర్రర్ ,ప్రోబ్ లు ప్రత్యక్షమైతై డ్రిల్లింగ్ ఫిల్లింగ్..కొత్త మంత్రోచ్చారన రూట్ కెనాల్ లో పడి కొట్టుకుపోతం డెంటల్ కేరిస్,జింజివైటిస్ లో తేరుకుంటం మెటల్ పల్ల మోకా నడుస్తుంటది పండ్లు లేని నాగరికత పండ్లిగిలిస్తది దేహ పుస్తకం మీద గాలి మల్లి పండ్ల అద్యాయం తలుక్కుమంటది చైనాకు ఆటూ ఇటు మన ఇంటి ముందరే బ్రష్ ల చెట్టు రోజు రోజు కు దానం చేసె అదొక రంంతి దేవుడు తలచు కొంటెనె అదాయం పన్ను కలిసి వస్తది పెయ్యికి పెద్దర్వాజ మౌనం తాళం కప్ప ఎట్ల తెరుచుకోవాలి "ఈ" ఈ"కీ" ఎప్పటిదో అనుము చెడ్దది చిన్న చెక్కలగులచాలు ముఖం సూర్యుడు డైద్ది ముప్పైరెండు గుర్రాలు మెరుపు లెక్క కదులుతై అమ్మా అని పలికితె అవి మీటని వీణలు ఉండయి బండ గుండె లోనూ పాలు పొంగుతై నోరు .. ఒత్తిడిని వెలిగక్కె దేహ పొగగొట్టం హ హ హ అది హ్రుదయపు శ్వాస తేరి పార చూడు ఆ కనిపిస్తున్న తలకిందుల ఇసుర్రాయిని అది అప్పుడే చేయించుకున్న చంద్రహారం అప్పులోని గుర్రాలోలే ఒక దానిమీద ఒకటి అప్పుడవి రెండు రంజాన్ చంద్రవంకలు సప్త పథమున పొందిచ్చిన ఈస్టర్ ఐలాండు నవ్వితే హాస్యకుహరమే వెయ్యి వరాల పాపికొండ నింగి నుంచి నేలకు దూకె గంగ నోట్లనే బుడుబుంగ పాలు పల్లు ఆకుకూర ..తీరొక్క సియ్యకూర అదొక ప్ర"యోగ"శాల పంటి పొంటనే పానసరం బన్న జలచరం.. అది నాలుక నాలికమీదె నానా రుచుల తండ తండాలకొక కొండదేవర చుట్టూ కంటికి రెప్పల రొమ్ము విర్చుకొని కొలువైన రాయంచలు చిన్న చిరునవ్వుకే మొఖమ్మీద పొద్దుతిరుగుడు దీపం స_త_థ_ స్థాన _కారణ్యాలతో భాషించే సొగసు చక్కని ఆహారపు గొలుసు సంస్కౄతికి నిలివెత్తు దినుసు స్వరపేటికకు మంచి ఆందాన్ * * * * *
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hg5ugd
Posted by Katta
by Arcube Kavi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hg5ugd
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి