మా ఎదురింటి కిటికీలో ఒక సూర్యబింబం ఉంది అది నన్ను చూసీచూడగానే తన క్రీగంటి చూపుల తీక్షణలతో కిటికీ తలుపుల్ని ఠపీమని మూసేస్తుంది మా వెనకింటి కిటికీలో ఒక చంద్రబింబం ఉంది అది నన్ను చూసీచూడగానే తన చల్లటిప్రేమ కిరణాల్ని నాపైకి వెదజల్లుతుంది మా కుడిపక్కింటి కిటికీలో ఒక తారక ఉంది అది నన్ను చూసీచూడగానే తన మినుకు మినుకుమనే తళుకుల చూపుల్ని నాపై ప్రసరింపజేస్తుంది మా ఎడపపక్కింటి కిటికీలో ఒక కలువపువ్వుంది అది నన్ను చూసీచూడగానే తన ఎర్రటి కాంతుల్ని నాపైకి రువ్వుతుంది నన్ను పలకరించి పరవశింపజేస్తుంది.
by Chandrasekhar Sgd
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKFr8e
Posted by Katta
by Chandrasekhar Sgd
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKFr8e
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి