పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

Kotha Anil Kumar కవిత

@ కార్మిక దినోత్సవం @ ఒక నిరసన లోంచి ఉద్బవించిన మహోదయం ఇది హక్కు కోసం నినదించిన గుండెలు పిడికిల్లెత్తిన దినం ఇది చెమటకు విలువ కట్టక నెత్తురును లెక్క చేయక దేహాలను హూనం చేస్తూ శ్రామిక కండబలాన్ని దోచేస్తున్న పెట్టుబడి దారు మధబలాన్నికృశింప జేసి అనైతిక వ్యాపార దొరనిని కంపింప జేసిన విజయారుణోదయం ఇది. పారింది శ్రమ జీవుల రక్తమే.కాని, ఆ గెలుపు కార్మిక జాతికి యుగాంతం వరకు...ఒక పెద్ద దిక్కు. అది శ్రామిక జీవన గమనంలో ఒక నిత్య నూతనోధయం. ఆ విజయపు రుదిర ధారలు స్వేద వంశీకుల మనుగడకు కొత్త దారులు పని చేయడమే మన పని కాదని, శ్రమకు విలువ సాదించడమని పని మనుషులకు విలువ సాదించుకోవడమని వృత్తికి సమాన వేతనం ఉండాలని వేళకు మించి శ్రమ బారం ఉండరాదని కార్మిక భవిత స్వర్ణమయం కావాలని హక్కుల కోసం పోరాడి ఆ ఆశయ సాధనలో ఎందరో నేలకొరిగిన త్యాగదనులదినమిది. అందుకే, ఈ అరుణోదయం ఈనాడు కార్మిక దినోత్సవమైంది... _ కొత్త అనిల్ కుమార్. 1 / 5 / 2014

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hVc27K

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి