పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, మే 2014, గురువారం

John Hyde Kanumuri కవిత

తరతరాలుగా ఏమీ లేదిక్కడ నినాదాలు తప్ప ప్రపంచ కార్మికులారా! ఏకంకండి! ఏమిసాధించాం మళ్ళీ బానిసత్వానికి తెరలు తీద్దాం కాంట్రాక్టు పనులన్నీ బానిసత్వమేగా! చెమట రంగు పులుముకొని నినదిద్దాం చెమటకు అన్నిరంగులొక్కటే అక్కడో బిర్యానీ దొరుకుతుంది! ఈ రోజు గడిచిపోతుంది ఎండిన డొక్కలు మండే కడుపులపై ఎసి కార్లు దూసుకుపోతాయి నిన్నెవరో పుట్టారు! ఈ రోజెవరో గిట్టారు! ఎవ్వరు మిగిల్చిందేమీ లేదు అలా అలా విదిల్చిన అక్షరాలను అద్దాల మేడల్లో పదిలపర్చుకుంటున్నారెవరో! రెక్కల కష్టం నాదే! ఆకలి అరుపు నాదే! ఆత్మఘోష, కంఠశోష కన్నీటి చెరువులెండిపోతున్నాయి సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు ఏమీ లేదిక్కడ నినాదాలు తప్ప .............some mixed feelings 1.5.2014 05:40 hours ISD

by John Hyde Kanumuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nK3RPa

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి