ఏకాంత మధుసేవ|| డా// కాసుల లింగారెడ్డి || 01-05-2014 సహచరులెవ్వరు లేకుండానే పూకొమ్మల మధ్య ఒంటరిగా కూర్చొని మధుపాత్ర చేతికి తీసుకుంటాను నేను చెయ్యెత్తి చంద్రునికొక ఛీర్సుకొడతాను అప్పుడు, తను,నేను, నా నీడ కలిసి ముగ్గురమవుతాము. కాని, చంద్రుడు త్రాగడు నా నీడ నిశ్శబ్దంగా నన్ను అనుసరిస్తుంది నా నీడతో, చంద్రుడితో నేను సంతోషంగా వసంతకాలపు అంచులదాకా ప్రయాణిస్తాను. నేను పాడితే చంద్రుడు నాట్యం చేస్తాడు నేను నృత్యిస్తే నా నీడ కూడ నాట్యం చేస్తది. మేము నిశ్చింతగా జీవన సంతోషాల్ని పంచుకుంటాము తాగిన తర్వాత తమతమ దారుల్లో విడివడుతుంటాము నిత్య సంచారులమే అయినప్పటికీ మేము నిరంతర స్నేహాలము మరొక వెన్నెల వీధిలో మళ్ళీ కలుస్తాము. -డా|| కాసుల లింగారెడ్డి 1 ఎఫ్రిల్ 2014 సెల్: 8897811844 ( LIPO ‘DRINK ALONE’ అను కవితకు స్వేచ్చానువాదము)
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5JXeO
Posted by Katta
by Lingareddy Kasula
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o5JXeO
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి