పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, జూన్ 2014, సోమవారం

Harsha Vadlamudi కవిత

జీవన్మరణాల మద్యలో జీవిస్తున్న జీవశ్ఛవాన్ని నేను, బతుకు బాటలో ఎండమావి కోసం పరిగెడుతున్న బాటసారిని నేను, నడిచే శవాల మద్య బతుకు బండిని లాగుతున్న యంత్రపు మనిషిని నేను, నిరాశల పల్లకిలో వర్తమానాన్ని మోస్తూ భవిష్యత్ ఊహల్లో తేలే ఆశావాదిని నేను, మానవ సంభందాల పేరుతో కపట ప్రేమను నటించటం రాని సగటు ప్రేక్షకుడ్ని నేను, బతకాలంటే రోజూ మానసికంగా చావాలని తెలియని బతక నేర్వని వాడ్ని నేను, నాతో నేను సాగిస్తున్న పోరాటంలో గెలిచేవరకు ఓడుతున్న సైనికుడిని నేను, చస్తూ బతుకుతూ కూడా బతుకు మీద తీపి చావని మనస్సు బానిసని నేను, మనిషిలా బతకాలంటే మృగంలా ప్రవర్తించాలని తెలియని మానవ మృగాన్ని నేను, ఆశల ఎడారి ప్రయాణంలో అలిసిపోయినా ఆగలేని వృద్ద యువకుడ్ని నేను......

by Harsha Vadlamudi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wjeQ3R

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి