సమతాంకురం ----------------- నాటాను చైతన్య బీజం- చల్లాను వాత్సల్య జలం! మొలకెత్తుతుంది సభ్యతా అంకురం. మమతా గాలి తగిలి, మొక్క ఎదిగి- మారాకేసి, వృద్ధి చెందుతుంది! పచ్చని రెమ్మల మధ్య పసిడి మొగ్గై, 'ఎప్పుడు విచ్చుకో గలనా?,- ఆ నిరీక్షణా బాధ్యతాయుతమే! మొగ్గపువ్వై,పువ్వుకాయై...పండై, ఉపకర్త కావాలనే తీవ్ర వాంఛ! అభ్యుదయ భావానుభూతికి, అభ్యున్నత స్నేహానుభూతికి, సర్వ ప్రాణులూ హక్కుదారులే! కుతూహల కదనమే గాని ... క్రూర సమరం అవాంఛనీయం! సమతా సమాజ నిర్మాతల- విరామ మెరుగని క్రాంతి పయనం, సేవా సాఫల్యాన ఉప్పొంగే హృదయం- స్వాత్మానుభవ శాతి వలయం. స్వచ్చా మానసం-ఆనంద నిలయం! వ్యధలూ,సౌఖ్యలూ లయ విన్యాసాలై అరుణోదయంలో ఐక్యమౌతున్నాయ్!! దారిద్ర్య,ఖేద దు:ఖాలు సమయగా, వివక్షా రుగ్మతలు తొలగగా... పులకింతుము పుడమి జీవులం- ఉల్లములెల్ల వెల్లువలై ఉప్పొంగగ- అలరారు ఆబాలగోపాలం!!! (2006,కవితామాలిక సంకలనం లో ప్రాచురింపబడింది. 2008,లో మహాకవి'జాషువా'విశిష్ట సేవా పురస్కారం 'సాహితీ శిరోమణి'అనే బిరుదును సంపాదించిపెట్టింది.)
by Achanta Hymavathy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rprdZx
Posted by Katta
by Achanta Hymavathy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rprdZx
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి