పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Divya Kiran Takshikasri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Divya Kiran Takshikasri లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Divya Kiran Takshikasri కవిత

శతాబ్దాలు గడిచాయి, దశాబ్దాలు దాటాయి! ఎన్నో మార్పులు మరెన్నో చేర్పులు ! కొన్ని కలయికలు మరిన్ని చీలికలు! ఆనందాలు అవధులు దాటుతున్నాయి, సంప్రదాయాలు సాకిల పడ్డాయి ! కానీ....... పీడితులు, పీడించేవారు, కార్మికులు, కార్పోరేటువారు, రైతన్నలు, రాజకీయ వాదులు,ఓటర్లు నాటకాల నాయకులూ, ఇంకా ఉన్నారు...... పేదలు, పేరు గడించిన వారు, నిర్భాగ్యులు, నీటు తాగే వారు, దౌర్భాగ్యులు, దౌర్జన్యాలు చేసే వారు, ఈ లోకంలో ఇంకా ఉన్నారు ..... ఆకలి దప్పుల ఆర్త నాదాలు, అన్యాయాల అరణ్య రోదనలు టపాసులై పేలుతున్నాయి, దీపావళి దీపాలు ఆర్పుతున్నాయి! బానిసత్వం బాట విడలేదు, కులం గోల కూత ఆపలేదు, రాక్షసులు రాజ్యం వదలలేదు, మద్యం సీసా మనసు దోచింది, సిగరెట్టు పొగ సిగానేక్కి కూర్చుంది! రాజకీయం రాబందులాగా రక్కసి కోరలు చాచింది ! ఇన్ని భూతల మధ్య అమాయకపు జనం ... ఎన్ని యుగాలు మరీనా ఉదయించని జ్ఞానం! అందుకనే ఈ లోకం.... మండుతోంది మండుతోంది ఆరని ఒక మంటలా! రావణుడి కాష్టం లా ! మండుతోంది మండుతోంది వెలుగులేని దివ్వెలా ! ఎగరలేని గువ్వలా ! మండుతోంది మండుతోంది అలుపు లేని ఆర్తి లా! అణగారిన జాతిలా! మండుతోంది మండుతోంది తీరని ఆకలిలా! ఆరని ఒక మంటలా!

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V54GqC

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Divya Kiran Takshikasri కవిత

రఘుకుల సోమా ! రవి హృదయ ధామా ! శంకరుని శ్యామా ! శరణాగత భౌమా ! యజ్ఞో జ్యలిత చంద్రమా ! యయాది రక్షా మంత్రమా ! రామా ! రానా రంగాది ధీమా ! రమ్య రాజో చ్చరిత భీమా ! రక్షించవేరా రామా ! రమా రమ్య హృదయమా ! శిక్షించనేలా మహాత్మా ! శిశువునై వేడితి మహిమా ! నేరాలు చేసితి నేను ! ధీరాలు పలుకగ లేనూ ! ఘోరాన పాపగు నన్ను ! మోక్షించి దీవేనలిమ్ము ! మీ కిరణ్ కుమార్ త్రిపురారిభొట్ల

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Umvp1d

Posted by Katta

19, జూన్ 2014, గురువారం

Divya Kiran Takshikasri కవిత

కలం పట్టి కదం తొక్కి, ప్రజల నాడి చేతపట్టి, పెద్ద గద్దల ఎండ గట్టి, కదలాల్సిన జర్నలిజం కను చూపుల జాడలేదు, పార్టి కి ఒక పేపరు ఆ పేపరు ఒక సాంఘిక పేరు, కానీ ప్రతి పేపరు చేసేది భజన, ఒక వ్యక్తి నో, ఒక వర్గాన్నో, ఒక రాజకీయ పార్టి నో, ఒక ప్రాంతాన్నో తీసుకుని చేసే భజన ... చివరికి రాసిన వాడు, రాయించిన వాడు ఆనందంగా కలిసి భోజనం చేస్తారు, మరి పిచ్చి జనాలు మాత్రం రాళ్ళు రువ్వుకుంటారు.... సోదరులార లేవండి కళ్ళు తెరవండి, ఈ రోజు పత్రిక లో వాస్తవాలు కనబడవు అవి చూసి మనం ఆగ్రహించవద్దు, అవధులు దాటి అరాచకాలు చేయొద్దు......,

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nmrfys

Posted by Katta

Divya Kiran Takshikasri కవిత

ఎర్రని ఆ నీరు ఏమిటి ? ఓహో! నా దేశం లో ని ఒక అరాచకాల నది కాబోలు! చిరు నవ్వుల చెల్లెళ్ళు , న్యాయం అడిగిన సోదరులు, అమాయకపు తండ్రులు బాలి కాబడిన ఒక నది ! నల్లని ఆ ప్రాంతమేమి ? ఓహో ! కలవాళ్ళు కలిసే చోటు కాబోలు ! అందుకే నెమో అందులో జరిగే దుర్మార్గాలు ధర్మదేవత కి కనబడవు ! అదేమిటి ఆ వెర్రి కేకలు? ఓహో ! మా పేద బంధువుల ఆకలి కేకలు కాబోలు! ఉచితం గా వచ్చే సిమ్ కార్డ్ వారు తినలేరు, అది తప్ప ఇంకేది ఇక్కడ ఉచితం గా రాదు మరి !

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ynIGWZ

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Divya Kiran Takshikasri కవిత

ఏడు వసంతాల ఈ కాలం నీ కలయిక తో నాకు ఏడు క్షణాల సమానం! ఈ నా నిలకడకు, నా సంతోషానికి, నా విజయాలకి, నీవు కారణం అనే ప్రత్యేక ప్రవచనం అనవసరం! నేను తప్పు చేయబోతే నా మనసు వెనకే నన్ను తడుతూ ఆ మైకం నుండి మేల్కొలుపుతావు! నేను తప్పటడుగులు వేస్తే నా కంటి చూపువై నువ్వు సన్మార్గం చూపుతావు! "నేను" అనే అక్షరం లో నువ్వు చేరి నాకు అర్థం చేకూర్చావు ఈ పుట్టిన రోజు నీకు ప్రత్యేకం! మొన్నటి వరకు నువ్వు ఒక్కదానివే! తరువాత ప్రేమ లో ఇద్దరం! పెళ్ళితో మనం ఒక్కటిగా మరాము! ఇప్పుడు మనం ముగ్గురం! మళ్ళి జన్మకు కూడా నికు నేనే ఉండాలని, మనం ఇలా ఒక్కటవాలని కోరుకుంటూ...... నాతో ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని......... నవ్వుతూ నన్ను నడిపిస్తూ హాయిగా ఉండాలని.... మన పాప తరపున, నా తరపున నీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు "బుజ్జి" నీ దివ్యకిరణ్ In our journey these 7 years, I’m feeling like 7 seconds…… Behind my stability, my happiness & my victories you are the backend, no need to specify it….. If I’m on fault you awoke my heart into right…. If I’m on wrong way, you shown the path with my eyes…….. “I” became a meaningful “we” with you…… This is a special birthday to you my dear…. In past you just one, then we both in love, After that we became one in marriage, now we are three…… I heart fully wishing for next life also my heart will be yours……… You should celebrate many more birthdays with me and direct me with your cheerful smiles……… On behalf of our daughter and from me the cheering wishes……. Many more happy returns of the day BUJJI Yours DivyaKiran

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDzmw6

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Divya Kiran Takshikasri కవిత

దేశం దేహం వేరు వేరు కాదు ! రెండూ ఒక్కటే రెండింటి తీరు ఒక్కటే ! చిన్న తప్పే కదా అని చేసేస్తే దేశం పాడవుతుంది ! చిన్న దెబ్బే కదా అని వదిలేస్తే దేహం పాడవుతుంది ! క్రమ శిక్షణ బాగా పాటిస్తే దేశం బాగుంటుంది ! క్రమ శిక్షణ తో యోగ చేస్తే దేహం బాగుంటుంది ! వ్యర్ధ పదార్ధాలు తగ్గిస్తే దేశం పచ్చగా ఉంటుంది ! వ్యర్ధ ఆహారాలు తగ్గిస్తే దేహం గట్టిగ ఉంటుంది ! దేశాన్ని ప్రేమించు ! దేహాన్ని క్రమబద్దీకరించు ! జై భారత్ !! మీ కిరణ్ ......

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAMAFW

Posted by Katta

14, జూన్ 2014, శనివారం

Divya Kiran Takshikasri కవిత

శోకిస్తున్నది భారతావని మనలను మోస్తున్నందుకు ! తన కూతుళ్ళను తన కొడుకులే కాటు వేస్తున్నందుకు ! మూడు యుగాలలో లేని ఆకలి బాధలు ఈ "కలి" లో ఉన్నందుకు ! రాజకీయ రాక్షసి బారిన పది అమాయకులు అల్లాడుతున్నందుకు ! ఇనాటికి కార్మికుల రక్తాన్ని లీటర్ల కొద్ది తాగే పడు జలగలు ఉన్నందుకు ! మన తల్లి బాధలు తీర్చి కన్నీటిని తుడిచే వరపుత్రులం మనమే...... ఇకనైనా లేద్దాం....పాట రాతలను కోత కోద్దాం............ మీ కిరణ్

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SI7ec3

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Divya Kiran Takshikasri కవిత

నాన్న! నా జన్మకు ఊపిరినిచ్చిన వెన్నెల దిన్నె .. బ్రహ్మ చేతుల లోని ఈ బొమ్మకి , అమ్మ కడుపులో ఊపిరినిచ్చావు ! అమ్మ ఒడి లోని ఈ రెమ్మ కి , కమ్మని కథలే కానుకలిచ్చావు ! కొంగు చాటు దాగిన ఈ బుడతడికి , ప్రపంచాన్ని చూసే వెలుగునిచ్చావు ! తప్పతడుగుల నడిచే ఈ బుజ్జిగాడికి , చెంగు చెంగున చెలరేగే పరుగునిచ్చావు ! ముద్దు ముద్దు పలుకుల ఈ చంటిగాడికి , గోరుముద్దల తెనుగు బువ్వ పెట్టావు ! ఆటలాడుతు తిరిగే ఈ ఆకతాయికి , చదువులమ్మ ఒడిలో ఓనమాలు నేర్పావు ! ఎంత ఎదిగినా నీకు నేను చంటి బొమ్మనే కాన ! ఎందెందు తిరిగినా నీకు నేను చేతి ఊత నౌతాను.. చిన్నప్పటి నా ధైర్యం “నాన్న” అనే రెండక్షరాలు ! ఇంకేప్పటికి నీ ధైర్యం "నేను" అనే రెండక్షరాలు ! నివు చెప్పిన ఆ కథలు, నా జీవిత దీక్షతలు ! నివు చూపిన ఆ వెలుగు, నా జీవిత వెన్నెలలు ! నివు నేర్పిన ఆ నడకలు, అలుపెరుగని నా పరుగులు ! నివు పెట్టిన తేట తెలుగు, నా నోట ముత్యాల పలుకు ! నాన్న! నాకున్న ఓ తియ్యని వెన్న.. సరిపోదు ఈ జీవితం ప్రేమించాలంటే నీకన్న …. నీ బుజ్జిగాడు , కిరణ్

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lgLdb8

Posted by Katta