వస్తుస్పష్టతతో గొప్పగా నిర్వహించబడిన కవిత. గుండెల్ని కదిలించే కవిత. సాక్ష్యం / ప్రసాదమూర్తి ------------------------- కురిసిన నెత్తురు కురిసినట్టే ఉంది మేఘాల సాక్ష్యం ఏదని ఆకాశం కేసు కొట్టేసింది. తెగిపడ్డ తలకాయలు కళ్ళ ముందు ఎగురుతూనే ఉన్నాయి మొండేల జాడ ఏదని గాలి కేసు కొట్టేసింది వెన్నుపూసను వణికిస్తున్న జ్ఞాపకాల చెట్టుకు నరకబడ్డ కాళ్ళూ చేతులూ వేళ్ళాడుతూనే ఉన్నాయి కత్తుల మీద నెత్తుటి చుక్కలు లేవని కాలం కేసు కొట్టేసింది మృతదేహాల మూటలు తుంగభద్ర తరంగాల్లో కలిసి తలలెత్తి ఎగిసిపడుతూనే ఉన్నాయి నీరు నోరు మెదపలేదని గట్టు కేసు కొటేyసింది హతులున్నారు హంతకులే లేరు హంతకులున్నారు సాక్షులే లేరు సాక్షులున్నారు వినే చెవులు లేవు చూసే కళ్ళు లేవు ఇదేంటని ప్రశ్నించే నోళ్ళున్నా సాక్ష్యంగా జవాబులే ఉండవని ఫైనల్ గా మనువు కేసు మూసేశాడు సాక్ష్యం చెప్పవే చుండూరా చుండూరా చుండూరా దేశం దేహమ్మీద సలపరం పెడుతున్న మనుధర్మ రాచపుండూరా!! (చుండూరు మారణకాండలో బాధితులకు న్యాయం కోసం పోరాడుతున్న శక్తులకు మద్దతుగా..) ( 23.06.2014.... సోమవారం, ప్రజాశక్తి )
by బాలసుధాకర్ మౌళి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lid3Zn
Posted by Katta
by బాలసుధాకర్ మౌళి
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lid3Zn
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి