పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, జూన్ 2014, సోమవారం

Bharathi Katragadda కవిత

వీరవనిత అసలైన వీరవనితవి నీవేనమ్మా! అందుకే నీకు వేల వేల వందనాలమ్మా! వీధుల్లోని చెత్తాచెదారాన్ని ఊడ్చేస్తూ శుభ్రంగా వుంచే నీవే కదమ్మా అసలైన వీర వనితవి. అర్ధరాత్రి సైతం వీధుల్ని శుభ్రం చేసే నిన్ను చూస్తుంటే నీ ధైర్యాన్ని అభినందించాలో నీ వృత్తిధర్మాన్ని మెచ్చుకోవాలో నాకర్ధం కావడం లేదమ్మా! తోడేళ్ళు,గుంటనక్కలు పొంచి వుండే ఈ అర్ధరాత్రి సమయంలో నిన్ను నీవే రక్షించుకుంటూ సాగిపోయే నీ మనోధైర్యానికి నిజంగా వేల వేల సలాములమ్మా! అయినా నీచుట్టూ వుండే ఈ సమాజానికి నీ కష్టాన్ని గుర్తించే తీరికెక్కడిదమ్మా? ఒకవేళ గుర్తించినా నిన్నేదో అంటరానిదానిలానే చూస్తారే తప్ప నిన్ను నిన్నుగా గుర్తించే హృదయమెక్కడిదమ్మా! మీరే లేకపోతే మీ శ్రమే లేకపోతే ఈ సమాజంతో పాటుగా ఈ పరిసరాలెంత కల్య్షితం అవుతాయో కదా!! ఒక్క క్షణం దుర్ఘంధానికే ముక్కు మూసుకునే వీరికి అదే దుర్ఘంధంలో నీవు అనుక్షణం చెలిమి చేస్తుంటే కరడుకట్టిన వీరి హృద్ఫయాలకి కనీసం చిన్న కదలికైనా లేదే? అణువంత కనికరమైనా లేదే? అర్ధరాత్రీ సైతం మీ ధైర్యం చూస్తుంటే నడిరేయి సైతం మీ వృత్తిధర్మం చూస్తుంటే నిజంగా నీకు వేల వేల సలాములమ్మా!!! (అమీర్పేటలో ఒక వివాహానికి హాజరైన నేను అర్ధరాత్రి అక్కడ రోడ్లు ఊడుస్తున్న స్త్రీలని చూసి మనసు చలించి రాసిన కవిత) 23.JUNE14.

by Bharathi Katragadda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/UATfX0

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి