జాస్తి రామకృష్ణ చౌదరి ప్రేమలేఖ నీ ముఖమే ఎదురుగా ఉంటే ఇక నాకా నెలవంక ఎందుకు నీ కన్నులే నాలోకి చూస్తుంటే ఇక నాకా కలువలెందుకు నీ హాసమే ఒక గీతమవుతుంటే ఇక నాకా సంగీతమెందుకు నీ సౌందర్యమే ఒక జ్యోతిలా ఉంటే ఇక నాకా వెలుగెందుకు నీ ప్రేమే నా ప్రాణమవుతుంటే ఇక నాకా హృదయమెందుకు ఇక నీవే లేకుంటే ఈ జీవితమెందుకు? అందుకే లతలా నన్నల్లుకో నా కౌగిలిలో ఉండిపో! నీకై తపిస్తున్న నా మనసుని నీ అనురాగంతో పెనవేసుకో...... నాకోసం స్పందించే నీ గుండెతో నా జీవితాన్ని పంచుకో.... మన ప్రేమ కావాలి ఒక మధురకావ్యం మన జీవనం కావాలి ఒక సుందరవనం ఓ సఖీ ఇదిగో నా ప్రేమలేఖ అదే నా హృదయరేఖ ఇదిగో నా కౌగిలి అదే కావాలి మన లోగిలి! 20Apr2014
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1moK1sk
Posted by Katta
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1moK1sk
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి