_AllouT_ లోపలా బయటా కలిపి అంతా బయటే లోనేముందని కాదు..అసలు లోపలనేదే లేదు మనసు బయటపడితే మనసుకంతా బయటేగా మరి!! లోపలాబయటల్లేని లోకమెంతుందో మనసంతైపోవాలంటే మనసు లోకమైపోవాల్సిందే లోపలా బయటా లేకుండా మనససలప్పుడెక్కడున్నట్టు?? అంటేవున్నకార్యకారణాలకు తర్కం వెతకడమాగి మనసుంటుంది నిశ్చలంగా లోకమై కార్యమే కారణమై!! కనిపిస్తున్నదంతా కనిపించేదయ్ దాటిపోలేనంత దూరమని తెలిసాక ఇంకేం పనుందనో మూడోకంటికి మూస్కోవడంలేదు!! అయినా దగ్గరా దూరాలను కలిపేస్కున్న దాని దృష్ఠికి penial gland చేసేదేముంది ఒళ్లంతా మోక్షాన్ని కక్కడం తప్ప!!______ (20/4/14)
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f9LhI1
Posted by Katta
by Chi Chi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f9LhI1
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి