పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

ShilaLolitha Poet కవిత

ఉమ్మ నీటి సరస్సులో~~~__ ________________ అదొక చిగురు మొగ్గ అప్పుడే పూచిన లేలేత పరిమళం హిమాగ్ని జ్వాలల్లో ఉదయించే దీప శిఖ చీకటి గర్భ కుహరాల్లోంచే ఆలోచనల మొలకల్ని జల్లుకుంటూ వచ్చింది మునగ దీసుకుని పడుకున్న క్షణాల్లోనే తానెవరో తెలీక పోయినా స్కానింగ్ కిరణాలు ఒళ్ళంతా తడిమి తొలిసారిగా తానెవరో చెప్పినప్పుడు ఒక్క అమ్మ తప్ప అందరూ వాడిన మాటల కత్తుల గుత్తులు నాపై జళిపించి నప్పుడు తొలిసారిగా చెవులున్నందుకు దుక్కం వచ్చింది నన్ను నేనే చూసుకోలేక పోతున్నాను నాపై అప్పుడే ఈ యుద్దరావాలేమిటి ? నా ఒంటరి పోరాటానికి మొదటి మెట్టు మొదలైనదప్పుడే ! నా కోసం అమ్మ చేస్తున్న పోరాటానికి అమ్మా!నేనున్నానని చెప్పాలని తపన గుండె ఉంది కానీ గొంతు లేదు కదా బాధ ఉంది కానీ చూపించలేను కదా మనిషినేకానీ సగం మనిషినే కదా ! ఈ ఉమ్మనీటి సరస్సులోనే నేనొక నెత్తుటి కలువై ఒలికి పోతానో రవ్వల మెరుపై వెలుగు చూస్తానో తెలీదింకా కానీ నాకు మా అమ్మ ఒళ్ళో ఒదిగి పోవాలనుంది!

by ShilaLolitha Poet



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i28Low

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి