పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Sriramoju Haragopal కవిత

తవ్వుకుంటుపోతే రక్కసిగుడి నొకటి తవ్వి చూసాం ఏమున్నాయక్కడ ఇన్ని ఎముకలు అన్ని కుండలు, కుండల్లో వడ్లవో, గోధుమలవో ఉనుక ఆ కుండలపై బొమ్మలు, రాతలు చుట్టూ పేర్చిన బండరాళ్ళు పెట్టెలాగా ఆ మనిషి ఆడమనిషే, అవి ఆమెవే వస్తువులు కాళ్ళకు కడియాలు, చేతులకు గాజులు ఏవో లోహానివి మెడకు తీగెకు గుచ్చిన రంగు రంగుల రాళ్ళపూసలదండ ఆమె పక్కన పెట్టిన కుండల్లో ఏవేవో మట్టిబొమ్మలపలకలు ఆడుకున్నవే కావొచ్చు గవ్వలసంచొకటి, బొక్క బొట్టుపెట్టొకటి చుట్టు వెతుక్కుంటుపోతే అక్కడొక రోలు, రుబ్బురాయి, విసురురాయి ఇంకొంచెం దూరాన ఒర్రె పక్కన పాటిగడ్డ పాతయిండ్ల ఇటుకలపోగులు అక్కడొక గుంటతవ్వి మట్టిపొరలలోపలికి దూరిపోతే ఆమె అక్కడే వంటచేసుకుంటు కనబడ్డది చంటిబిడ్డకు పాలిస్తూనే పనులన్ని సవరిస్తున్నది అతిథులవంటి మమ్మల్ని చూసి వాళ్ళాయన వొచ్చేదాకా ఆగమంది మేం అరుగు మీద కూర్చున్నాం కెమెరా తీసి ఫోటోలు తీస్తున్నాం గుడిసెకప్పు మీద గుమ్మడితీగెలు, పచ్చటిపూలు, కాయొకటి తెగిందేమొ వొచ్చి మా వొల్లోపడ్డది కల రాలిపోయింది మళ్ళీ ఆమె సమాధి ఒడ్డున మేం అపుడు కూడా అంతేనా ఆడది? ఇప్పటి సంకెళ్ళలోనేనా వున్నది?

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1joIfCp

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి