కొంతం వేంకటేశ్: నీవు..: జీవన పోరాటపు ఆటుపోట్లను అవలీలగా ఎదుర్కొను శక్తిని నింపే హృద్యమయిన రూప చిత్రము నీవు కదా..! విజయ సోపానలనధిరోహించి చరిత్రను పునర్ లిఖింప అపూర్వావకాశమును సఫలీకృతంజేయు చైతన్య స్తోత్రస్సు నీవు కదా..! మనస్సున మమతల మల్లియ మాలలు కూర్చిన కన్నుల కదలాడు అత్మీయానురాగ తేజో కాంతి పుంజం నీవు కదా..! ఉల్లమును రంజించి నవరాగ సంగీత శోభలద్దిన సుమధుర స్వరఝరి నీవు కదా..! డెందం ఆమంద కందలిత అరవిందభరితమయ్యే సున్నితోజ్వల సుకోమల చేతనావర్తిత చేష్ట నీవు కదా..! మానవత్వం మూర్తీభవించి రేబవళ్ళు తెలియక భవదీయుని నామ జపమున ప్రణయ తత్వమును శిఖరంజేర్చిన ప్రేమమూర్తివి నీవు కదా..! మాటలకందని భావాలకు కవితలకందని కమ్మదనాలకు అనుభూతులకందని ఆశ్చర్యాలకు ఎల్లలు తేలియని తీయదనాలకు చిరునామా నీవు కదా..! 20/04/2014
by Kontham Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lqmhV8
Posted by Katta
by Kontham Venkatesh
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lqmhV8
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి