పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మనసు లోతు|| =========================== = మనసు అగాధాల మధ్య నెర్రలు తీసింది గాయాలు గులకరాళ్లై గుచ్చుకుంటున్నాయి తడి ఆరని గుండెలు తరాలుగా తరుక్కుపోతున్నాయి నెర్రల మధ్య అంతరాలు తొంగి చూస్తున్నాయి శిధిలమైన గతాలు మట్టి పెల్లలులా విరిగిపడుతున్నాయి లోతుల్లో గతాలు స్వగాతాలై వెక్కిరిస్తున్నాయి ఆరని తలరాతలు ఇంకా మండుతూనే ఉన్నాయి మంటల్లో ఆలోచనలు ఉడికి పోతున్నాయి మనసు వేడెక్కి ఎర్రగా అన్వేసిస్తుంది బీటలు తీసిన బాటల్ల ఆలోచనలు సాగుతున్నాయి మట్టి పొరల మధ్య దాగిన ఇసుక లోతుల్లో గమ్యం ఊట నీరులా కనపడుతుంది తవ్వే కొద్దీ జ్ఞాపకాలు బయలు పడుతున్నాయి మనసు లోతు ఒక అగాధంలా కనిపిస్తుంది గుండె గునపమై తవ్వుతుంది ఎన్నో ముద్రలు సజీవ దృశ్యాలై మట్టిలో కలిసిపోయాయి అచేతన స్థితిలో మనసును పడుకోబెట్టి చేతన స్థితిలో వడ్రంగి పిట్టలా డ్రిల్లింగ్ చేస్తూ తొలిచే ఆలోచనలు పదిలం చేస్తూ మట్టి మనిషినై బతికేస్తున్నా! ==================== ఏప్రిల్ 20/14

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1faYHnd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి