శ్రీస్వర్ణ || ముక్కుపుడక || ముక్కుపుడక మెరిసేది ముద్దులొలికే నీ మోము చూసే ! నీ వలపుల శ్వాసతో వెలిగే పుడక ..తళుకులీనే మెరుపురవ్వలతో కోహినూర్ వజ్రానికీ మెరుగులు పెట్టొచ్చు ! నీ పలుకుల్ని చెవులారా విన్నపుడు గుండె కవాటాలలో గుట్టుగా దాచినపుడు తేనెసోనలు తనువంతా వ్యాపించి సిందూర వర్ణాలే పులుముతుంది ! నీ నిశ్వాసలో వినిపించే నిశ్శబ్దరాగాలకి పులకించే ముక్కుపుడక బుంగమూతిలొ దాగిన అలుకలన్నీ నా నాసిక చటుక్కున ఒడిసిపట్టి నీ ముక్కును ముద్దాడి వినిపిస్తుంది ఆత్రంగా ! నీ సరసాల సంద్రంలో సన్నజాజుల అలల నురగల పూలు ఆత్మీయ ఆలింగనాలు .. సిగ్గుల తాంబూలాలు జార్చే నిట్టుర్పుల సెగలు..నాసికాభరణానికి నయనానందకరం ! పగలంతా మూగబోయిన మందారంలా గమ్మున కూర్చుంటుoదా.. గోధూలివేళ పగటి పరవశాలన్నీ వార్చి చిలిపి కబుర్ల పొట్లాలన్నీ విప్పుతూ గంధపు చినుకులు ఎదపై జార్చుతూ గుమ్మరించేస్తుంది గుప్పెడు నవ్వుల వజ్రపురాశులు..వెన్నెల వాకిట్లో !
by Swarnalata Naidu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1toq0np
Posted by Katta
by Swarnalata Naidu
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1toq0np
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి