పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Jagaddhatri Dhaathri Jagathi కవిత

జగద్ధాత్రి ||అసంబద్దత || కొన్ని సార్లు అంతే ఎవరూ నిందకు పాత్రులు కారు అయినా కొన్ని వదులుకోవాలి కొన్ని మరిచి పోవాలి కొన్నిటిని గుర్తు చేసుకోకూడదు మరి కొన్నిటిని దూరంగా పెట్టాలి ఆత్మ ద్రోహం చేసుకోవడం కన్నా ఆత్మీయులకు దూరంగా మెలగడం మంచిది కదా అవతలి వారు అర్ధం చేసుకోలేదని బాధ పడేకన్నా మౌనంగా మిగిలిపోవడం ఉభయ శ్రేయస్కరం కదా ఎక్కడినుండో వచ్చి చుట్టూ ముట్టిన సుడి గాలిలో అనుకోకుండా చిక్కుకుని అతలాకుతలమైన మనసును ఆత్మ పరిశీలన తోనే కదా సేద తీర్చుకోవాలి ప్రమాదం కన్నా ప్రమాదం నుండి వెంట్రుక వాసి లో తప్పించుకోవడం కూడా ఎంతో భీతిని మిగులుస్తుంది దశాబ్దాల అనురక్తి ముందు అర్ధం లేని అనుతాపం నిలబడగలదా కొన్ని అంతే సుడి గాలులు వీస్తాయి .... వాటినుండి తప్పుకోవడం మన ఇంగితం అంతే తప్ప దేనిపైనా కోపగించుకోలేము అక్షరాన్ని అన్యా క్రాంతం చెయ్యడం కంటే ఆత్మ హత్యా సదృశం మరొకటి ఉందనుకోను అనుబంధాన్ని బలి పెట్టి అసంబద్దాన్ని కోరుకోలేను ...............................................జగద్ధాత్రి 3.50 పి.ఏం . 28/05/2013 మంగళవారం

by Jagaddhatri Dhaathri Jagathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1huOCb5

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి