చాంద్ || స్త్రీ గురించి || ఈరోజు ఎందుకో ఆమె స్త్రీ గురించి రాయమని అడిగింది నాలో లేనిది నేను కానిది నన్నేమని వ్రాయమంటావ్ అని అడిగిన కళ్ళను తన చేతులతో మూసి ఇప్పుడు నీ లోనికి చూసి వ్రాయి అంది అమ్మ పాలు తప్ప మరేమీ రక్తంలో లేనపుడు అనురాగాన్ని నింపుకున్న ఒక పరిపూర్ణ స్త్రీని నా పసితనాన స్పర్శించిన అనుభూతిని ఆ ప్రేమ ఇంకా నాలో ప్రవహిస్తూ ఎవరినో నింపాలని ప్రయత్నిస్తూ గాయపడిన చోటే చిగురిస్తున్న ప్రతీ సారీ ప్రసవ వేదన పడుతున్న ఆడతనాన్ని నా హృదయం అచ్చం అమ్మలా నన్ను నన్నుగా నగ్నంగా పైట వెనుక దాయడాన్ని నెమ్మదిగా నన్ను నేను తడుముకుంటూ గమనించాను ******* ఒకే తాళితో రెండు దేహాలను కలిపి కట్టినప్పటినుండీ ఆమె నాలో తల్లిని వెదుకున్నపుడూ నా ఒడిలో అనురాగాన్ని త్రాగగలిగినపుడూ నేను స్త్రీని కాక ఇంకెకవ్వరు..? స్త్రీ గురించి రాయడం నాలో ఎప్పటికీ పూర్తవ్వదేమో మీ చాంద్ || 19.Feb.14 ||
by Chand Usman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bKCssj
Posted by Katta
by Chand Usman
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bKCssj
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి