పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Chi Chi కవిత

_ భాదల్స్ _ ఒంట్లో మూడొంతుల మట్టి భాదల్ని ఒక్కొంతు నీరు మింగలేక కక్కే కన్నీటిలో ప్రపంచమంతా ప్రతిభింభంగా నిత్యం జారిపోతూ శోకం ఆవిరైపోతున్నా హృదయం తాలలేని సంకుచితాలెన్నో నిత్యం నీరూర్చుతూ శోకాన్ని బతికిస్తూనే ఉన్నాయి!! కన్నీటి రుచి తెలుసా అంటే!! ఏమో రకరకారణాలు అకారణంగా ఏడ్చే రకాలుకూడా పుట్టకముందూ , చచ్చాక కూడా ఉండే బ్రహ్మాoడమే బతుకని తెలిసాక కూడా సౌభాగ్యమనే భ్రమ చుట్టూ మతి తిరుగుతూ మాటవరసకి మనిషైపోడం దౌర్భాగ్యమే !! ఎలా ఉంటాయవి!! కళ్ళకి చప్పగా , నాలుక్కి ఉప్పగా , చంపలకి చల్లగా గుండెకి బరువుగా , బుర్రకి గురువుగా , నలుగురికీ నవ్వుగా పారిపోయే ప్రతి బొట్టుకో చరిత్రున్నా లేకున్నా నిలువెత్తు ప్రశ్నకి సమాధానాలుగా సందర్భోచితంగా సాగిపోతూనే ఉంటాయి!! hello!! బాగున్నా..అంతా బాగున్నాం.. అన్నీ బాగున్నాయి.. మీరెలా ఉన్నారు మీకేంటి.. ఎలా ఉన్నా బాగుంటారు..మాకన్నా మీరే బాగుంటారు మాదేం బాగు లెండి.. బాగుండండి.. ఉంటాను మరి.. రెండు వైపులా ఒకే బాగు .. ఒకే భాద పంచుకుంటే ప్రేమంట.. ప్రేమిస్తే భాదంట.. భాదుంటేనే బాగంట భాదున్నా బాగున్నా ఏడుపేనంట!! ఒంటర్ల ఒంటరైన సృష్టిలో జంటలు కూడా ఒంటర్లే అంటే ఒప్పుకోరే!!అందుకే భాద పోలికల politicsలో అన్నీ గెలవాల్సిందే జనాల జాడ్యం!! భాదల్లో కూడా పోల్చుకుని చస్తారెందుకో బూడిదగొట్టు bodyలు మళ్ళీ మొండాలకి ఓదార్చే ముండమోపులు కావాలి ఇక జూస్కో!! bolo bolo bolo bujji kyaa భాదా హై!!అంటూ వచ్చేస్తారు పెంచుతారో , తగ్గిస్తారో తెలీదు కానీ ఓదార్పు పేరుతో వాళ్ళ అనుభవాల సినిమా చూపించి వాళ్ళే whistles ఏస్కుంటారు ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే పొరపాటుగా కూడా భాదల్లో ఉన్నోళ్ళు ఇంకో emotion express చేయకూడదు ఓదార్చే వాళ్ళ స్వేచ్చకి భంగం కలిగిస్తే మళ్ళీ వాళ్ళు కూడా భాదపడతారు అప్పుడేం చేయాలో అర్థం అవక ఇంకో భాదకి doors open అవుతాయి!! so..భాదను మింగో , మర్చిపొయ్యో , తీరిగ్గా ఓదార్పు తీస్కుని వాళ్లకేవైనా భాదలోస్తే వెళ్లి same protocol అమలుపర్చేయాలి!! ఏదైనా ఉంచుకుంటే ఉంటుంది , తెంచుకుంటే పోతుంది భాద మాత్రం ఉంచుకుంటే పెరుగుతుంది , తెంచుకుంటే మిగుల్తుంది మనసు మార్చుకున్నా మరచిపోలేం..మనిషిపోవాల్సిందే!! ___________________________________Chi Chi (19/2/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eRjAlE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి