పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Siddenky Yadagiri కవిత

గెలిచిన కల వతందారి నేలను వల్లకాడు జేసిన ఆరున్నర దశాబ్ద అక్రమ పాలనకి ప్రజాక్షేత్ర స్మశానంలో తల గొర్రాయి తగులుకొంది బతుకుల్ని చిదిమిన చరిత్రలో రాలిన వేల పానాల పానదుల సాక్షిగా అమరులు అల్లిన సర్వుగంప పరువుతో నెత్తికెత్తుకొంది ప్రజాస్వామ్యం ప్రజాకంటకం దుర్మార్గపు ఏలుబడి దురంతం దురాలోచన పేక మేడల్ని కన్న తల్లుల కడుపుకోత శోక ప్రవాహం సునామి అలల శక్తితో సులువుగా ఇనుప సిమ్హాసనాన్ని కూలదోసింది కాలం కత్తి కొన మీద కాంతిరేఖ నిలుప నాలుగు వందల మంది జీవర్పన నైద్యం మలిదశలో వినిపించిన మరన వాంగ్మూలాలు 'జై తెలంగాణ ' నినాదపు దేహ దహనపు మంటలు శిథిల చరిత్ర శకలాలై రక్తాక్షరాలు ముద్రించిన బిల్లు పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర శాసనం మోరపారకం మోసంతో పంటకు జీవిగంజి పొయ్యని నీళ్ళు దప్పిక గొంతుల్ని తడపని నీళ్ళు దాహార్తి తలరాతల్ని మార్చేందుకు పరవల్లు దొక్కాలి అమరుల ఆశయ సాధనలో అవినీతి రహిత భవితను బహుజన ప్రజాస్వామ్య తెలంగానం బహుచక్కగ నిర్మిచుకోవలే ... .

by Siddenky Yadagiri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eRuTKD

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి