పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // ఎదగాలి సోదరులమై మనం // అన్నలారా అక్కలార ఆంధ్రా..తెలంగాణా తెలుగు తల్లి బిడ్డలారా.. గాయ పడ్డ మనసులారా .. ఇది గెలుపు ఓటమిల సమస్య కాదు కాదు కానే కారాదు ఇది నీకు నాకు వైరము వలదు.. వలదు నీ దుఃఖము నాకు సంతసమునూ,నా ఏడుపు నీకు ఆనందమును కలిగించ తగదు కానే కారాదు.. ఎప్పుడైనా ఇది ఒప్పు కానేరదు ఒకే తల్లి బిడ్డలకు కానేరదు కలలోనైనా కలిగించు కోరాదు ముందు ముందును నీకు నాకు నొప్పి, మన తప్పు ఒప్పుల అనుమాన స్పద కాన్వాయి ల పై నుండి నువ్వు నేను, ప్రక్క ప్రక్కనే బస చేసి ఉన్నాము..నాడు ఆనాడు.. నేడైనా .. ఆ అహంకార ద్వేష వృక్షాలు దిగి చెట్టా పట్టాలేసుకొని, ఇంకనూ ఉందాము ప్రక్క ప్రక్కనే ఒకరి మదిని ఒకరెరిగి చిరకాలము.. ఒకరికొకరు తోడు నీడై ఎదుగుదాము నింగిలో నంత ప్రక్కవారికి ఆదర్శము కాగా.. ఆనందం సంతోషం.. బాధలు దు:ఖాలు అంతా నీవే .. నీ వారే .. అంతా నీవే ,ఇకనైనా... కోపాలు తాపాలు వీడి ఇరు వర్గాల మేలు కోరి ఎగురుదాము ఎదుగుదాము అనంతానికి నిచ్చెనలు వేసి.. జయహో తెలుగు వారు ఐక్యత వర్ధిల్లాలి అని ఉల్లాసంగా పాడుకుంటూ.. (ఎన్నో సంవత్చరాల పోరాటాలు, ప్రాణ త్యాగాలు అనంతరం తెలంగాణ రాష్ట్రానికి అనుమతి లభించినందున ఇరు వర్గాల ప్రజలు కక్ష్యలు మాని రెండు ప్రాంతాలను అభివృద్ధి పరచుకోవాలని ఆసిస్తూ .. మీ సాటి తెలుగు వాడు .. )

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1geXYSV

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి