పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Gangadhar Veerla కవిత

కొలువులు అనేకం ...................... కొన్ని కలుపుగోలుతనాలు మరికొన్నికలగలపుతనాలు ఒక్కో చోట.. అందంగా లభించే ముత్యపు చిప్పల్లోని స్నేహాలు మరింకో చోట.. కొంతకాలం బంధాలు మరికొంతకాలం.. అరమరకలు లేని స్నేహాలు..! కొంత గురుసాంగత్యం మరికొంత అన్నదమ్ముల అనుబంధం జీవిత పోరాటంలో..చేసే కొలువులు మారుతుంటాయి పరిచయ రూపాలు మారుతుంటాయి బంధాల్లోని అనుభవాలు మాత్రం అవే విడిచిన నేలపై వదిలిపెట్టిన పరిమళాలను మరోసారి వెదుక్కుంటూ వెళ్ళడం కష్టమే కానీ, అప్పుడప్పుడు.. ఆ వాకిట.. ఆ అనుభవాలు మిగిల్చిన మనసుల్ని, మనుషుల్నిమర్చిపోవడం సాధ్యం కాదు కొలువులు అనేకం గుప్పెడంత స్నేహం అందించిన.. మనుషులు, మనసులు మాత్రం పరిమితం..!! (చేసిన కొలువుల్లో మనసులో మనసై నాతో మసిలిన స్నేహసుమాలకు ప్రేమతో) 19 ఫిబ్రవరి-2014

by Gangadhar Veerla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1d0f4l3

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి