kb ||కుక్కిరాత|| పిల్లలు ఏడుస్తారు, అయితే ఏంటి? కాసేపయ్యాక తేటగా నవ్వుతారు. ఆకులు రాలిపోతాయ్,. అయితే ఏంటి? కాలం గడిచాక, చిగురాకులు పుట్టుకొస్తాయ్. కుక్కలు మొరుగుతుంటాయ్, అయితే ఏంటి? కొద్దిసేపటి తరువాత, గొంతలసి మూలన మునగదీసుకుంటాయ్. రాష్ట్రాలు విడిపోతాయ్, అయితే ఏంటి? పిల్లలు ఏడుస్తూనేవుంటారు, లంచగొండులు లక్షణంగా బతికేస్తుంటారు, రాజకీయాలు ఎప్పటిలానే ముండమోస్తు నడుస్తుంటాయ్. ఆకులు రాలతూనే వుంటాయ్,. శోకాల్లో రాగాలు తగ్గిపోతాయ్,. ఆనందాలు ఆవిరైపోతాయి. కుక్కులు మొరుగుతూనే వుంటాయ్. మారని మనుషులు కొత్తకొత్త సమస్యలను వెతుక్కుంటారు, లేదా సృష్టించి సంతృప్తి పడుతుంటారు. చానల్ల చర్చలు చెవుల్ని హోరెత్తిస్తూనే వుంటాయ్. కవులు అలానే రాస్తుంటారు. ఓపికున్నోళ్లు చదువుతుంటారు. ఏది పట్టని కష్టజీవులు బతుకీడుస్తుంటారు. ఎంత కాలం గడిచినా,. ఏ మార్పులు వుండక, మళ్లీ కలిస్తే ఏలా వుంటుందోనన్న ఆలోచనలు వస్తాయ్. కుంటి నడకల హొయలు సాగుతూనే వుంటాయ్. ముక్కలైతే కాని చెట్టు, కట్టెలై కాలిపోదు. గుర్తుకొస్తు సెగలై తగులుతూనే వున్నా,. రాష్ట్రాలు విడిపోతాయ్,. అయితే ఏంటి? -----------------------------------------19/02/2012
by Bhaskar Kondreddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQBwNf
Posted by Katta
by Bhaskar Kondreddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eQBwNf
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి