పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

Prasad Atluri కవిత

||ప్రసాద్ అట్లూరి||దగాపడ్డ గుండెలు|| భంగపడ్డ బిడ్డలారా దగాపడ్డ తమ్ములారా బెంగ పడకండి ! విడిపోతే పడిపోతామేంటి ? ఐనా ఎగసే ప్రతికెరటం పడే లెగుస్తుందిగా! అణుబాంబు మీదపడినా చిగుర్లు చిగురించలేదా ప్రగతిలో పయనించట్లేదా! కష్టపడే గుణం కల్గినోడివే తెలివైన బుర్ర ఉన్నవోడివే ఉప్పెన్లెన్నొచ్చినా లెక్కచేయనోడివే!! ఒక బిడ్డను నవ్వించడానికి రెండో బిడ్డను ఏడిపించిన సవతితల్లి ప్రేమకు మధనపడకు! నీకేం కావాలో అడక్కుండా ఉరికొయ్యకు వేలాడేసిన పెద్దరికానికి పెద్దగా విలువనివ్వకు! పగబట్టినట్టు కాటేసిన కాలనాగుల కర్కశకోరలకు చిక్కినందుకు చిన్నబుచ్చుకోకు ! ఆఖరి నిముషం వరకూ ఆశపెట్టి వంతపాడిన తోడుదొంగల్ని తలచి అతాశుడివై మిన్నకుండిపోకు! లే తమ్ముడూ లే.. లేచి నిలబడు నీ జాతి నీకై వేచిచూస్తోంది.. ఎవడి పాపాన్ని వాడికే వదిలేసి కర్యోన్ముఖుడివికా.. నీ బిడ్డలను రక్షించు వాళ్ళ ఆశలను బ్రతికించు ఇంకెప్పుడూ విడిపోని పడిపోని మరో రాజ్యాన్ని నిర్మించు.. కాదన్నవాడి కళ్ళుభైర్లు కమ్మేలా నువ్వేంటో రేపు నిరూపించు !! >--బాణం-> 19FEB14 ( తెలంగాణా ఆకాంక్ష నెరవేర్చడం తప్పుకాదు ... ఆంధ్రా గోడును వినకుండా భరోసా కల్పించకుండా విడగొట్టిన పాపం మాత్రం ప్రబుత్వ పెద్దలదే ... సీమాంద్ర ప్రజలకు బాసటగా నాలుగు మాటలు ... )

by Prasad Atluri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MxQ6Dg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి