వెలుగులోకి సూరీడు ____________________అరుణ నారదభట్ల అరవై యేళ్ళుగా మునిగిన సూరీడు అడ్డుపడే గ్రహాల చాటునచీకటై కూచున్నాడు! ఎన్ని త్యాగాలో...ఎన్ని ఆత్మ బలిదానాలో ఇంకెన్ని మూగబోయిన గొంతుకలో ఇప్పుడే మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాయి! ఎన్నేళ్ళనుండో...ఎన్ని గొంతుకలో ఎర్రకోటను ఆశ్రయించి... పదమంటూ రోడ్డెక్కి వంటావార్పులను...బతుకమ్మగ తీర్చిదిద్ది వేదికలెక్కి గుండెగోడు వినిపించాయి! మన నీళ్ళూ..మన నిధులూ... మన కొలువులు...మన బతుకులంటూ తిండీ నిద్రలు మానీ.... నిరసించీ...నీరససించినా మన గడ్డ నినాదమే మన బాధ్యత అనుకుంటూ పదవులు పక్కనబెట్టీ... పదపద మని అడుగులేసి కాళ్ళిరగదన్నినా కదం తొక్కి మాటలు..పాటలు...ఆటలతో ధూం దాంగ నాట్యమాడె మన పల్లెలు! ఉస్మానియ క్యాంపస్సూ ఊబిలెక్క మారి పోయింది ధర్నా చౌక్ రోజూ దద్దరిల్లి పోయింది.. అసెంబ్లీ...పార్లమెంటు... అరుపులతో అడుగంటిపోయినై! ఉరితాళ్ళు ఏడుస్తున్నాయి... ఉత్తరాల్లోని లక్ష్యం చూసి కంటినీరు ఆగని ప్రవాహమైంది... ఊపిరీ బిగబట్టింది విషవాయువులకు బలైపోయి! రబ్బరు బుల్లెట్లన్నీ రక్తంతో తడిసిపోయాయి! బొక్కలన్ని పెళుసైనై... విరిగిన కట్టెల సాక్షిగ! రాస్తారోకో మంటూ.. రోడ్డెక్కి అడ్డుకుంటే... బొక్కలో తోసి కేసులు ఎత్తేయకుండ.. మళ్ళిమళ్ళి తన్నినా మాట్లాడలే మా భూమి కోసం! రైలు రోకొ...బస్సు రోకొ...కారు రోకొ...కంచరగాడిదనూ..రోకోమంటిమి! నిరాహారదీక్షజేసి. ప్రాణాలను పణంబెడితె నిమ్మకాయ నీళ్ళిచ్చి సరేలే ఇస్తామన్నది... ఇటలమ్మ...ఇడ్లీలాంటిమనసుతో... పుట్టినరోజుకు గుర్తుగ...తెలంగాణ! కమిటీలూ..కసరత్తులు కహానీలు చెప్పినా కలుపుమొక్కలన్నిజేరి.. కలిసుందామని సమైక్యపోరు చేసినా ఎలగబెట్టిన అరవైయేళ్ళు చాలు.. మాకొద్దూ..అనేట్టు చేసుకుంటిరి... మన సీమాంధ్రా నాయక అన్నలు! విడదీయరాని బంధం మనదైనా విడిపోక తప్పలేదు! ఒక్క ఇల్లుగా ఉన్న ప్రాంతం ఇప్పుడు పక్కింటిలా మారింది! ఎన్ని కోట్ల గుండె తడ్యో వర్షమై కురిసి తెలంగాణ చల్లబడ్డది వెన్నెలంటి పండగ జరుపుకుంటోంది! 19-2-2014
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eRAosN
Posted by Katta
by Aruna Naradabhatla
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eRAosN
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి