కరణం లుగేంద్ర పిళ్ళై //పోగాలం దాపురిస్తే...// పచ్చగడ్డి వేసినట్టే వేసి ఇద్దరి మధ్యా మంట పెట్టగలరు పచ్చని జీవితాలను వివాదాల ఊచలకు ఉరివేయగలరు పోగాలం దాపురిస్తే పుట్టేవి వంకర బుధ్ధులే మరి బతికి వున్నప్పుడే శరీరాన్ని ఆత్మను వేర్వేరు చేయగలరు ఎప్పటికయినా వేరే కదా అనే వేదాంతాన్ని చెప్పగలరు వినాశకాలే విపరీత బుద్ధంటే ఇదే మరి గజం కూడా వదలక వేల ఎకరాల గనులను తినేసి వాతాపి జీర్ణం అంటూ నేనేమి ఎరుగ అని అనగలరు భూమినాది అనిన భూమి ప్రక్కున నవ్వు మరిచారు మరి సిద్ధాంతాల వల్లె వేతలో సిత్రాలెన్నో చూపెడతారు సిత్రంగా తామే వాటిని కాలరాచి ఏకో నారాయణా అంటారు ఏకాభిప్రాయమంటే ఏక వ్యక్తి అభిప్రాయమట మరి చీమంత కూడా ప్రగతి కానరాకున్నా తామంత గొప్పవారం లేరంటూ చాటింపు వేసుకోగలరు పదవి కోసం ఎంతకైనా సరే దిగజారుడు నేర్చిన పాకుడిది ఎంతటి ఘనులంటే ఏలిన వారు వారసత్వం ఉనికి కోసం ఉసురు తీసినా ఊరినంతా ఉద్దరించినట్టు పోజులిచ్చే నటనా వైభవమిది ఎంతటి గొప్ప వీరులంటే పాలకులు స్వంత జనంపైన యుధ్దాలు చేసి బాంబులేయగలరు కంట్లో కారం చల్లి ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించడమిద ఈ ప్రభుత్వాల కు కళ్ళు లేవు .. ఈ పాలకులకు వినే చెవుల్లేవు ఏమంటే న్యాయదేవతకు మాత్రం వున్నాయా అనగలరు మరి తుమ్మితే ఊడిపోయే ముక్కుచందం అయినా తుమ్మే రాదు ..............తుమ్మేవారేలేరు... కర్ర వంపు తీర్చేది పొయ్యే కదా ఒకరి కడుపు మంట మరొకరికి భోగి మంటగా మారుతోంది అదిగో ఎన్నికల నగారా మ్రోగుతోంది.. మోసపుచ్చేందుకు ముఖాలు మార్చుకుంటూ సిద్దమవుతున్నారు జాగ్రత్త సుమా 16/2/14
by Lugendra Pillai
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kVNrSj
Posted by Katta
by Lugendra Pillai
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kVNrSj
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి