ఇందిర గారు రాసిన కవిత !!అమానుషం ||కవిత్వ విష్లేశణ ________________పుష్యమి సాగర్ ఒక వ్యక్తి తో పెంచుకున్న అనుబందాన్ని గుర్తు చేసుకునే క్రమం లో, ఆ వ్యక్తి మానసిక పరిస్థితి ని అందుకు గల కారణాలను చూపిస్తూ ఆమె గొప్పతనాన్ని కొనియాడుతూనే, ఇలాంటి దురదృష్ట అవస్థ కి కారణభూతమైన కొడుకులకు చెంప పెట్టు లాంటింది ఈ కవిత.. తన చిన్నప్పటినుంచి కొడుకుల జీవితాల కోసం తను ఎలా కొవ్వత్తి లా కరిగిపోయినది ..అందరిని బాగు పరిచాక తన జీవినం ఎటు వెళ్ళింది ఇవన్ని ఆమె గురించిన ప్రశ్నలే... ఒక పద ప్రయోగం బాగుంది 'కొడుకులగన్న కోట'వని సాధారణం గ నలుగురు గుమి కూడె చోట నాలుగు మాటలు అనేస్తారు అది కన్న పేగు గురించి అయినపుడు ఎంతో ఉప్పొంగి పోతారు కదా..అల అని చ్పెపినపుదు ఆమె కోట గాను కొడుకులు సైనికులు గాను పోల్చుకున్నారు నిజమే... మాతృ ప్రేమ ముందు ఎంతటి కష్టం అయిన కూడా దిగదుడుపు, వారి బాల్యాన్ని తన భుజాల మీద మోస్తూ వృక్షం లా తయారు చేసినది కుడిచెయ్యీ ఎడమచెయ్యీ అనకుండా//అందరి ముడ్లూ మూతులు కడిగి//అడ్డమైన చాకిరంతా//ఆనందంగా చెయ్యలేదా....// జనరల్ గా పిల్లల పై ప్రేమ మమకారం తో తాము ఎంతో చేసిన అది చాలా తక్కువే అనుకుంటూ సర్వం ఇచ్చేస్స్తారు, పిల్లి ఎలాగా అయితే తమ పిల్లలని రక్షణ కోసం తపన పడుతుందో అలాగే తల్లి కూడా తమ బిడ్డలా సంరక్షణ కోసం పాటు పడుతున్నది పూచికపుల్లా దాచిపెట్టి//తినీతినక కూడబెట్టి//పిల్లల్నినీ వీపుకు కట్టుకోలేదా// నేటి సమాజం లో ఒక అమానుష ధోరణి ని ఎలా కొనసాగుతున్నదో పరిశీలిస్తే, ఈ రోజుల్లో కన్న వారు కొడుకు లకు బరువు గా అనిపించి వృద్ధ ఆశ్రమాలలోను, లేదు కొదుకల మధ్య పంపకాలు, జరుగుతున్నవాస్తవ ఘటనలను కళ్ళ ముందుంచారు ఇళ్లూ వాకిళ్లు పంచుకుని//ఇప్పుడు నిన్నేపంచనుంచాలో తోచక ఎటూతేల్లుకోలేక//కొడుకులంతా//కొట్టుకుచస్తున్నారే ఇది సాధారణం గా అందరి ఇళ్ళలో నేడు కనిపిస్తున్న నిజం, స్వార్ధం పెరిగిపోయి కన్నవారు అని కూడా చూడకుండా వంతులు వారిగా అమ్మ ని , నాన్న ని పంచుకోడం వాటి కోసం కొట్టుకు చావడం మానవత కె మచ్చ లాంటిది. అయిన తల్లి తండ్రులను కాదు పంచుకోవాల్సింది, వాళ్ళు మలి దశ లో పడే కష్టాలను, కొంత సంతోషాన్ని, కొంత దుఖాన్ని, మరి ఆసరా ను , కాని ఆస్తి ని పంచుకున్నట్టు కన్న పేగు ను పంచుకునే లోకం రీతి ని నిరసించల్సినదె నువ్వేమైనా..//ఆస్తివా పాస్తివా//ఆబగా పంచుకోడానికి ! అన్ని పంచి ఇచ్చి జీవితపు చివరి ఘడియలలో ఎవరు ఇంత అన్నం పెడతారో అని ఆశ గా ఎదురు చూస్తూ ...తనువు లు చాలించే పిచ్చి తల్లి పడే ఆవేదనలు కన్పించవు ఎవ్వరికీ , అందరి కొదుకలను చేర దీసి ప్రయోజకులను చేసిన ఖాళి చేతులు ఇప్పుడు చావుకు దగ్గర వుండి తన పై విహారం చేసే ఈగలను తోలుకుంటూ దీన స్థితి లో కను మూసింది బుక్కెడు బువ్వకోసం//నీ గాజుకళ్ల ఎదురుచూపు//చావుకు చేరువైన చేతులు వాలుతున్న ఈగల్ని తోలలేక//వేలాడబడ్డాయి మనవ సమాజం లో అమ్మ పట్ల కొడుకుల నిరాదరణ ని ఎత్తి చూపించి, వారి ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలనే సందేశాన్ని వినిపించి వుంటే ఇంకా బాగుండేది అని నా అబిప్రాయం. ేటి ఆలోచన విధానానికి అద్దం పట్టేల ఇందిరా గారు వ్రాసారు అందుకు అబినందనలు మరిన్ని మంచి కవితలని అందించాలని కోరుతూ ... సెలవు ... అమానుషం నీకేందమ్మా మారాజువు 'కొడుకులగన్న కోట'వని నలుగురూ ఎకసెక్కాలాడినపుడు లోలోపల ఎంత ఉప్పొంగిపోయావో కుడిచెయ్యీ ఎడమచెయ్యీ అనకుండా అందరి ముడ్లూ మూతులు కడిగి అడ్డమైన చాకిరంతా ఆనందంగా చెయ్యలేదా ఏడేడు ఇళ్లల్లో పిల్లిలా తిప్పి కళ్లలో వత్తులేసుకుని పూచికపుల్లా దాచిపెట్టి తినీతినక కూడబెట్టి ఇల్లుకట్టి పిల్లల్ని నీ వీపుకు కట్టుకోలేదా అంతా ఒక రేవుకొచ్చేదాకా కునుకైనా తీశావా పిల్లలకై బ్రతకాలంటూ జీవితాన్ని ప్రేమించావే ఇళ్లూ వాకిళ్లు పంచుకుని ఇప్పుడు నిన్నేపంచనుంచాలో తోచక ఎటూతేల్లుకోలేక కొడుకులంతా కొట్టుకుచస్తున్నారే నువ్వేమైనా ఆస్తివా పాస్తివా ఆబగా పంచుకోడానికి ! ఆరుబయట అరుగుమీద బండరాయి గుండెలపై బుక్కెడు బువ్వకోసం నీ గాజుకళ్ల ఎదురుచూపు చావుకు చేరువైన చేతులు వాలుతున్న ఈగల్ని తోలలేక వేలాడబడ్డాయి నీచేతుల్లో ఏముందింక కనకమ్మత్తా !! 19/02/2014
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKVrm5
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nKVrm5
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి