పాశం _____పుష్యమి సాగర్ కన్నా.... నువ్వు కాళ్ళ తో తంతు అమ్మ గర్బం నుంచి భూమికి గెంతినపుడే నేను మరల పుట్టాను ఏమో ..! నా మోము లో వెయ్యి వాల్టు బుల్బుల వెలుగులు ... నీ అల్లర్లు నన్ను నడి వీధి లో నిలబెట్టినా కూడ నాకెప్పుడు ముద్దు గానే ఉండేవి నువ్వు నడక ను ఓనమాలు గా దిద్దినపుడు చదువుల తల్లి ఉయ్యాలలో ఉగుతున్నప్పుడు నువ్వు నడిచే దారంతా మల్లెల్లు కావాలని , కోసుల దూరలైన నా కాళ్ళ లో కి నదులై ప్రవహించేవి ...!! అక్షరాలు నీలోంచి నడిచి ప్రపంచపు పటము లో గుర్తులైనపుడు , విను వీధి లో నీ పేరు నలు దిశల మొగుతున్నప్పుడు నేను విహంగాన్ని ...ఆకాశమంతా చుట్టి వచ్చాను !!!.. నా నుంచి విడిపోయి మరొకరి గుండె లో నువ్వు నివసిస్తున్నప్పుడు కూడా ప్రేమ నే తాగాను , నువ్వు పంచి ఇచ్చిన జ్ఞాపక అమృతం తో ...! నీ ప్రయాణం సాఫీ గా సాగాలని నా కల ల మేడలన్ని కూల్చేసి నీకు పునాది అయ్యాను ....!! కాని కన్నా ..!! ఎదిగి వచ్చిన నీ పెద్దరికం కంటి తుడుపు మాటల వలయం లో నేను గిల గిల కొట్టుకుంటున్నప్పుడు నువ్వే లోకమని భావించిన నాకు ఏమి కాకుండా దూరంగా నెట్టబడుతున్నాను !! రాత్రింబవళ్ళు నిద్రలని కొండ ఎక్కించి నిన్ను ఎవరికి అందనంత ఎత్తున కూర్చోబెట్టాను నీ నీడ ను కూడా నాలో కలుపుకొని కను రెప్పలు మూయక నా వీపు పై మోసాను కదా... నా మనసు లో సముద్రాన్ని ధారపోసినా కూడా, ...గుప్పెడు ప్రేమ ని బిక్షం గా వెయ్యలేకపోయావా బిడ్డ...!! నీ సుఖాల కోసం నేను రెక్కలు తెగిన పక్షి లా మారినా కూడా ఈ కన్న తండ్రి పై నీకు ప్రేమ కలగలేద కన్నయ ... నువ్వు ఆర్తి గా పిలిచే !!నాన్న !! పిలుపు కోసం ఈ కట్టే కాలే దాక ఎదురు చూస్తూనే ఉంటుంది మై సన్ ....!!! లవ్ యు .. జూన్ 05, 2014
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tLwPwA
Posted by Katta
by Pusyami Sagar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tLwPwA
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి